26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

Deputy CM Pawan Kalyan: వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి.. పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు..

Date:

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతిచెందింది.. ఆ చిరుత కడుపులో రెండు పిల్లలు కూడా చనిపోవడంపై విమర్శలు వచ్చాయి.. మదనపల్లె మండలం పొన్నూటిపాళెం సమీపంలోని అటవీ ప్రాంతం సమీపంలో పొలం గట్టుపై వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడిన ఆడ చిరుత.. దాదాపు 8 గంటల పాటు నరకయాతన అనుభవించి ప్రాణాలు విడిచింది.. వేటగాళ్ల ఉచ్చునుంచి బయటపడడానికి చిరుత చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మృత్యుఒడికి చేరింది.. అయితే, అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో చిరుత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.. పీసీసీఎఫ్‌ చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌..

Read Also: JEE Main: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫైనల్‌ ‘కీ’ వచ్చేసింది..

పొన్నూటిపాళెం వద్ద ఆడ చిరుత వేటగాళ్ల ఉచ్చులోపడిపోయి కొన్ని గంటలపాటు పెనుగులాడి చనిపోయింది.. ఆ చిరుత కడుపులో రెండు కూనలు ఉండటం, ఆ కూనలు కూడా గర్భంలో చనిపోయాయి.. అయితే, ఈ ఘటనపై క్షేత్రస్థాయి నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని, శాఖాపరంగా ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఘటన చోటు చేసుకున్న అనంతరం సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందించారనే విషయాన్ని తెలియచేయాలని ఆదేశించారు.. ఉచ్చులు వేసే వేటగాళ్లు, ఆ తరహా నేరాలు చేస్తున్నవారిపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.. పొన్నూటిపాళెం ఘటనపై విచారణను పర్యవేక్షించాలని అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావుకి దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sad: పాల కోసం ఏడ్చిన చిన్నారి.. గొంతు నులిమి చంపేసిన కసాయి తల్లి..

పుట్టిన బిడ్డను చూసుకుని.. నవమాసాలు మోసిన విషయాన్ని కూడా మర్చిపోతుంది తల్లి....

Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!

ఏడడుగులు నడిచి జీవితాంతం కలసి జీవిస్తామని కొత్త బంధంతో జీవితాన్ని ప్రారంభించిన...

Story Board : ట్రంప్ భారత్ కొంపముంచాడా? కొవిడ్ పరిస్థితులు మళ్లీ వస్తాయా ?

అమెరికా-ఇరాన్‌ యుద్దం…భారత్‌ కొంప ముంచుతోందా ? కరోనా పరిస్థితులు దేశంలో వచ్చే...

Bank Holidays: బ్యాంకులకు వరుస సెలవులు.. వరుసగా మూడు రోజులు.

వరుస సెలవుల కారణంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మూడు...