ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 2ను మంగళవారం నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రయాణికులను అలర్ట్ చేశారు. సరికొత్త సౌకర్యాలతో టెర్మినల్ 2 రూపుదిద్దుకోనుంది. 2006లో నిర్మించిన దాని కంటే ఎక్కువగా.. ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా టెర్మినల్ 2న నిర్మించనున్నారు. ఇందుకోసం మంగళవారం నుంచి టెర్మినల్ 2 మూసివేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం టెర్మినల్ 2 నుంచి 122 ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ విమానాలన్నీ మంగళవారం నుంచి టెర్మినల్ 1కి మారుస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: Tu Mera Lover: చక్రి ఏఐ వాయిస్ తో రవితేజ సాంగ్ .. భలే ఉందే!
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యధిక రద్దీలో ప్రపంచంలోనే టాప్ 10లో చోటు సంపాదించుకుంది. అయితే అందుకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా టెర్మినల్ 2 మూసివేస్తున్నారు. టెర్మిల్ 1, 3 నుంచి కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఇక నుంచి టెర్మినల్ 1, 3 నుంచే అంతర్జాతీయ, దేశీయ విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఇప్పటికే ఆయా విమాన సంస్థలు మెసేజ్‌లు పంపించాయి. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎయిర్‌లైన్ సంస్థలను సంప్రదించాలని కోరింది.
ఇది కూడా చదవండి: Visakhapatnam: గర్భిణీ హత్య కేసులో కీలక విషయాలు తెలిపిన స్నేహితులు…