11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

Deepali Ghosh: హ్యాట్సాఫ్ బామ్మ.. నెటిజన్ల మనసు గెలుచుకున్న 70 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్

Date:

Deepali Ghosh: ఒక బామ్మ కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని నిరూపిస్తూ.. మూడు దశాబ్దాలుగా ఓ చిన్న హోటలే ప్రపంచంగా బతుకు బండిని ముందుకు తీసుకెళ్తున్నారు ఆమె. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. హౌరాకు చెందిన దీపాలి ఘోష్ అనే బామ్మ. ఈ బామ్మ కథ ఏంటి, ఎందుకని అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది, నెటిజన్ల కళ్లు చెమర్చేలా ఎందుకు చేస్తోంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Kollywood : వెనక్కు జరుగుతోన్న కోలీవుడ్ యాంటిసిపెటేడ్ మూవీస్

సాధారణంగా 70 ఏళ్లు పైబడ్డారంటే విశ్రాంతి తీసుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన 70 ఏళ్ల దీపాలి ఘోష్ కథ వేరు. ఆమె అలసటను ఎరుగరు, ఆత్మగౌరవాన్ని వదులుకోరు. గత 30 ఏళ్లుగా ఒక చిన్న హోటల్‌ను ఒంటరిగా నడుపుతూ, తన కష్టార్జితంతోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవలే కంటెంట్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ సోషల్ మీడియాలో పంచుకున్న ఈమె కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

లాక్‌డౌన్ మిగిల్చిన కష్టం
భర్త మరణం తర్వాత కుటుంబ భారం మొత్తం దీపాలి భుజాలపై పడింది. అప్పటి నుంచి ఈ చిన్న హోటలే ఆమెకు సర్వస్వం అయ్యింది. ఈ వయసులోనూ స్వయంగా మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం, పొయ్యి రాజేసి వంట చేయడం, కస్టమర్లు తిన్న ప్లేట్లను శుభ్రం చేయడం.. ఇలా అన్నీ తానై చూసుకుంటూ హోటల్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. విశేషమేమిటంటే ఆమెకు ప్రత్యేకంగా ఇల్లు అంటూ ఏమీ లేదు. పగలు కస్టమర్లు కూర్చునే హోటల్ ప్లాట్‌ఫామ్ మీద ఒక మూలనే ఆమె రాత్రిపూట నిద్రిస్తారు. ఒకప్పుడు తన హోటల్ కస్టమర్లతో సందడిగా ఉండేదని, కానీ లాక్‌డౌన్ తర్వాత పరిస్థితి తలకిందులైందని దీపాలి కన్నీటి పర్యంతమయ్యారు. “గతంలో చాలా మంది వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజుకు కేవలం ఐదుగురు మాత్రమే వస్తున్నారు. సంపాదన తగ్గినా, పని చేయడం మాత్రం మానలేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

చచ్చే వరకు ఇక్కడే ఉంటా..
ఎవరో ఒకరు సాయం చేసి ఆమెను వృద్ధాశ్రమానికి పంపిస్తామంటే, దానిని ఆమె సున్నితంగా తిరస్కరించారు. “నాకు వృద్ధాశ్రమం వద్దు. ఈ హోటలే నా ప్రాణం. చనిపోయే వరకు కష్టపడి నా కడుపు నేనే నింపుకుంటాను. ఈ హోటల్ తలుపులు తెరిచి ఉన్నంత కాలం నేను సంతోషంగా ఉంటాను” అని ఆమె చెప్పిన మాటలు నెటిజన్ల మనసు గెలుచుకున్నాయి. ఆరాధన ఛటర్జీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఆ బామ్మ హోటల్ అడ్రస్ ఎక్కడో చెప్పాలని, తాము అక్కడికి వెళ్లి భోజనం చేసి ఆమెకు ఆర్థికంగా అండగా ఉంటామని వందలాది మంది ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు. ఆత్మగౌరవంతో బతుకుతున్న ఈ బామ్మ కథ, కష్టాల్లో ఉన్న ఎందరికో కొండంత స్ఫూర్తినిస్తోందని అనేక మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ తన కష్టాన్ని మాత్రమే నమ్ముకొని, ఎవరి మీద ఆధారపడకుండా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆ బామ్మకు సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

READ ALSO: Musi River Project: మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం.. భూసేకరణ షురూ!



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad Hawala Racket: పాతబస్తీ అడ్డాగా హవాలా ‘చీకటి’ దందా.. కోడ్ భాషలో కోట్లు మార్పిడి!

Hyderabad Hawala Racket: హైదరాబాద్‌లో హవాలా మార్కెట్ యథేచ్చగా సాగుతోందా? చాప...

Hardeep Singh Puri: ‘‘ఎప్‌స్టీన్‌ను 3-4 సార్లు కలిశా, కానీ’’ రాహుల్ విమర్శలపై కేంద్రమంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి...

Rafale fighter jets: ఆపరేషన్‌ సిందూర్‌లో అసలైన హీరో ‘‘రాఫెల్ జెట్స్’’..

Rafale fighter jets: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళానికి...

Gaurav Gogoi: “అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్‌లో గడిపాం.. కానీ”.. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!

Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం...