1
March, 2026

A News 365Times Venture

1
Sunday
March, 2026

A News 365Times Venture

Darren Sammy: “2016 రిపీట్ అవ్వడం పక్కా.. భారత్‌ను చిత్తు చేస్తాం”.. టీమిండియాకు వెస్టిండీస్ కోచ్ సవాల్!

Date:

Darren Sammy: రేపు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్- వెస్టిండీస్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో సింపుల్ నినాదం ఒక్కటే.. గెలిచిన జట్టు సెమీస్‌కు, ఓడిన జట్టుకు ఇంటికి.. ఇది మాత్రం ఫిక్స్. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే మ్యాచ్‌ కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. స్టేడియంలో 80 వేల మందికి పైగా ప్రేక్షకులు, బయట 140 కోట్ల ప్రజల ఆశలు ఈ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ప్లేయర్స్‌పై ఒత్తిడి సైతం బాగానే ఉంది. ఈ తరుణంలో వెస్టిండీస్ కోచ్ మాత్రం చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. ఆయన భారత్‌కు సవాళ్లు సైతం విసురుతున్నారు. “వరల్డ్ కప్ గెలవాలంటే ఎప్పుడో ఒకప్పుడు భారత్‌ను ఓడించాల్సిందే. ఆ రోజు రేపే” అని వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ అన్నారు. 2016 జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో భారత నేలపైనే విండీస్ సంచలనం సృష్టించింది. అదే ఊపును ఈ సారి సైతం తేవాలని చూస్తున్నారు. “ఇది డేవిడ్ వర్సెస్ గోలియత్ లా అనిపించవచ్చు. కానీ 2016లో డేవిడ్ గెలిచాడు. అదే సందేశం నా బాయ్స్‌కు ఇస్తున్నాను” అని సామీ నవ్వుతూ చెప్పారు. 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, భారత్‌ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేసింది. ఈ మ్యాచ్‌ను ఉద్దేశించి సామీ ఈ వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..

సాధారణంగా వెస్టిండీస్ అందరికీ రెండో ఫేవరెట్ టీమ్. కానీ ఈ మ్యాచ్‌లో భారత్‌కు శత్రువులుగా మారుతున్నారు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి వచ్చినా సామీ ఆందోళన చెందడం లేదు. “ఒక ఓటమి మీ జట్టును నిర్వచించదు. భారత్ కూడా ఓటమి తర్వాత బలంగా తిరిగి వచ్చింది. ఇప్పుడు మేము స్పందించాలి. ఇది వర్చువల్ క్వార్టర్ ఫైనల్. అమలు ముఖ్యం,” అని అన్నారు. జట్టులో మార్పులపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. “నా సైనికులందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. టాస్ సమయంలో జట్టు తెలుస్తుంది. నా వద్ద 11 మంది డేంజర్ ఆటగాళ్లు ఉన్నారు. మేము ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నాం” అంటూ చిరునవ్వు చిందించారు. గత మ్యాచ్‌లో 83/7 స్థితిలోనూ 177 వరకు చేరిన జట్టు పోరాటస్ఫూర్తిని ప్రశంసించారు. “83 పరుగలకే ఏడు వికెట్లు కోల్పోతామని అనుకోలేదు. కానీ ఆ పార్ట్‌నర్‌షిప్ క్యారెక్టర్ చూపించింది” అని చెప్పారు. అదే ధైర్యం మళ్లీ కావాలని కోరారు. గెలిస్తే భారీ సెలబ్రేషన్ ఉంటుంది. 10 ఏళ్లుగా సెమీఫైనల్‌కు చేరలేదు. ఈసారి మైదానంపైనే డ్యాన్స్ చేయాలని ఆశిస్తున్నామని హాస్యంగా చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

LPG Cylinder Prices: యుద్ధం వేళ.. పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంతంటే?

ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు చమురు ధరలను సమీక్షిస్తుంటాయి....

Operation Roaring Lion: ఆపరేషన్ రోరింగ్ లయన్.. ఖమేనీతో పాటు ఏడుగురు టాప్ కమాండర్లు ఖతం!

Operation Roaring Lion: ఇరాన్ చరిత్రలో ఫిబ్రవరి 28 – మార్చి...

ONGC Share: ఇరాన్‌- ఇజ్రాయెల్ చమురు మంటలతో.. ONGC ఇన్వెస్టర్లకు పండగ?

ONGC Share: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి....

Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..

Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభాన్ని స‌ృష్టించింది. సుప్రీంలీడర్...