2
July, 2026

A News 365Times Venture

2
Thursday
July, 2026

A News 365Times Venture

Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం

Date:

Damodar Rajanarsimha: డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. తమ నైపుణ్యం ద్వారా ప్రతి రోజూ వేల ప్రాణాలను డాక్టర్లు కాపాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, వారి సేవలు ఆరోగ్య వ్యవస్థకు ఎంతో కీలకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్య సౌకర్యాలు, తగిన మానవ వనరులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 440 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, సుమారు 800 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. డాక్టర్లతో పాటు ఇతర పోస్టులను కూడా పెద్ద సంఖ్యలో భర్తీ చేశామని చెప్పారు. సుమారు 15 వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డెంటిస్టుల ఆకాంక్షను నెరవేర్చుతూ 48 డెంటల్ సర్జన్ పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు.

ఈ రెండున్నర సంవత్సరాల్లో సుమారు 1,300 మంది డాక్టర్లకు పదోన్నతులు కల్పించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. డాక్టర్ల దశాబ్దకాల ఆకాంక్ష అయిన ఉస్మానియా నయా హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించామని, అలాగే గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో నూతన హాస్టళ్ల నిర్మాణం పూర్తికావొచ్చిందని మంత్రి తెలిపారు. వైద్యులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బందికి మెరుగైన వర్క్ ఎన్విరాన్‌మెంట్ కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాలను 15 శాతం మేర పెంచామని మంత్రి గుర్తు చేశారు. అద్దె భవనాలు, పాత భవనాల్లో కొనసాగుతున్న మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆధునిక భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ వైద్యుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యులు తమ సేవలను కొనసాగించాలని కోరుతూ, డాక్టర్స్ డే సందర్భంగా మరోసారి రాష్ట్రంలోని వైద్యులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!

Rythu Bharosa 3rd Installment Released Today: తెలంగాణ ప్రభుత్వం ‘రైతు...

Ashwin: ‘వైభవ్ నీళ్లు మోయడం అవమానం కాదు’.. విమర్శకులకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!

Ravichandran Ashwin: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో...

Steel Taps cleaning Tips: స్టీల్ ట్యాప్‌లు కొత్తవిలా మెరవాలంటే.. ఈ చిట్కా తప్పక ట్రై చేయండి

Steel Taps cleaning Tips: వంటగది లేదా బాత్రూమ్‌లోని స్టీల్ ట్యాప్‌లు...

Pithapuram Police: పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..

Pithapuram Police: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై...