21
March, 2026

A News 365Times Venture

21
Saturday
March, 2026

A News 365Times Venture

Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

Date:

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ సరికొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా వీరి మాయలో పడి కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త, ఒకప్పటి రాష్ట్ర మాజీ డీజీపీ మనుమరాలిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.1.20 కోట్లు కాజేశారు.

బాధిత మహిళ సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13న ఆమె కంపెనీ అకౌంటెంట్‌కు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. సదరు వ్యాపారవేత్త పేరు , ఆమె ఫోటోతో ఉన్న నంబర్ నుంచి ఆ సందేశం రావడంతో అకౌంటెంట్ అది ఆమె పంపినదే అని నమ్మాడు. “నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను, ఫోన్ కాల్స్ ఎత్తలేను.. వెంటనే నేను చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేయండి” అని ఆ సందేశంలో ఉంది. ఆ ఫోటో, మెసేజ్ చూసి తన యజమాని అని భావించిన అకౌంటెంట్, ఒకే లావాదేవీలో చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపించాడు.

Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.

మళ్ళీ ఈ నెల 17న అదే విధంగా మరో సందేశం రావడంతో అకౌంటెంట్ అప్రమత్తమయ్యాడు. ఈసారి భారీ మొత్తం కావడంతో చెక్ అప్రూవల్ కోసం నేరుగా ఆ మహిళా వ్యాపారవేత్తను సంప్రదించాడు. గతంలో పంపిన రూ.1.20 కోట్ల వివరాలను ఆమెకు వివరించాడు. అది విన్న ఆమె ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తాను ఎలాంటి డబ్బులు పంపమని మెసేజ్ చేయలేదని చెప్పడంతో, అది సైబర్ నేరగాళ్ల పని అని ఇద్దరికీ అర్థమైంది.

మోసపోయానని గ్రహించిన వెంటనే ఆమె 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు కేరళలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలు కేరళకు బయలుదేరి వెళ్లాయి. వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలు చూసి మోసపోవద్దని, భారీ మొత్తంలో నగదు బదిలీ చేసే ముందు సంబంధిత వ్యక్తులతో నేరుగా మాట్లాడి ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Indian Rupee Falls: ఒక్క రోజులో భారీ పతనం.. రూపాయి పడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

‘దురంధర్ 2’ సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని పూనమ్ కౌర్...

Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

విజయవాడ శివార్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి...

Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పోర్టులో మరోసారి భారీ స్థాయిలో రేషన్ బియ్యం...

Gas Supply : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట

దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక...