CSK vs SRH: నేడు చెన్నైలోని ఎం. చిదంబరం స్టేడియంలో నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఇక టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మొత్తం 21 మ్యాచ్‌లు జరిగగా.. వాటిలో చెన్నై 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరోవైపు హైదరాబాద్ జట్టు కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఇకపోతే, ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన పట్ల అభిమానులు చాలా నిరాశ చెందారు. చెన్నై 8 మ్యాచ్‌లు ఆడి రెండింటిలో మాత్రమే గెలిచింది. రెగ్యులర్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ గాయపడిన తర్వాత ధోని జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. కానీ, అతను కూడా అద్భుతంగా ఏమీ చేయలేకపోయాడు. అతని కెప్టెన్సీలో జట్టు ఒక మ్యాచ్ గెలిచింది. ప్రస్తుత సీజన్‌లో చెన్నై చివరి స్థానంలో ఉంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సీజన్‌లో తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత, ఆ జట్టు ఐదవ మ్యాచ్‌లో విజయం సాధించింది. మొత్తంగా జట్టు 8 మ్యాచ్‌లు ఆడి 6 ఓడి, రెండు గెలిచింది. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక నేటి మ్యాచ్ కు ఆడే ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హైన్‌రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కామిందు మెండిస్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నద్కట్, జీషాన్ అంసారీ, మొహమ్మద్ షమీ.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
హెడ్, మనోహర్, బేబీ, చహర్, ముల్డర్.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI:
షేక్ రషీద్, అయుష్ మ్హాత్రే, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ & వికెట్ కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
కంబోజ్, అశ్విన్, ఓవర్టన్, నాగర్కోటి, ఘోష్.