29
May, 2026

A News 365Times Venture

29
Friday
May, 2026

A News 365Times Venture

Cricket: 14 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం.. కానీ అజ్ఞాతంలో కెరీర్‌ ముగించిన ఆటగాడు మీకు తెలుసా..?

Date:

Cricket: ప్రస్తుతం ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనం సృష్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో 29 బంతుల్లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆటగాళ్లపై మళ్లీ చర్చ మొదలైంది. అదే సమయంలో హసన్ రజా పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది.

పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన రికార్డు రొమేనియా ఆటగాడు మారియన్ గెరాసిమ్ పేరిట ఉంది. అతను 14 సంవత్సరాల 16 రోజుల వయసులో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అయితే టెస్ట్ మరియు వన్డే క్రికెట్‌లో మాత్రం ఈ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన హసన్ రజా పేరిటే ఉంది. హసన్ రజా 1996 అక్టోబర్‌లో జింబాబ్వేపై ఫైసలాబాద్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా కేవలం 14 సంవత్సరాల 227 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. అనంతరం క్వెట్టాలో జరిగిన వన్డేలో 14 సంవత్సరాల 233 రోజుల వయసులో వన్డే అరంగేట్రం చేశాడు. అయితే అతని వయస్సుపై తర్వాత పెద్ద వివాదం చెలరేగింది. వైద్య పరీక్షల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అతని అధికారిక వయస్సుపై సందేహాలు వ్యక్తం చేసింది.

అయినా సరే, హసన్ రజా ప్రతిభపై ఎప్పుడూ సందేహం లేదు. అతని బ్యాటింగ్‌లో అద్భుతమైన టైమింగ్, క్లాస్, అందమైన స్ట్రోక్స్ కనిపించేవి. చాలా మంది మాజీ క్రికెటర్లు అతడిని పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుగా అభివర్ణించారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన అవకాశాలు లేకపోవడం అతని కెరీర్‌ను దెబ్బతీసింది. అరంగేట్రం చేసిన కొద్దికాలానికే అతడిని జట్టు నుంచి తప్పించారు. అనంతరం ఎక్కువ కాలం దేశీయ క్రికెట్ మరియు పాకిస్థాన్ ‘ఎ’ జట్టుకే పరిమితమయ్యాడు. దేశీయ స్థాయిలో మంచి ప్రదర్శనలతో మళ్లీ 2002-03లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆ సిరీస్‌లో 54 మరియు 68 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ, అతని నెమ్మదైన బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చాయి.

తర్వాత జింబాబ్వేతో మరో రెండు టెస్టులు ఆడినా, మళ్లీ జట్టులో స్థానం కోల్పోయాడు. చివరిసారిగా 2005 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌పై లాహోర్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతని అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిపోయింది. హసన్ రజా కెరీర్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ అనధికారిక ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL)లో చేరడం. ఆ సమయంలో ICLకు అధికారిక గుర్తింపు లేకపోవడంతో అందులో పాల్గొన్న ఆటగాళ్లకు జాతీయ జట్టులోకి తిరిగి రావడం కష్టమైంది. దీంతో అతని అంతర్జాతీయ క్రికెట్‌కు దాదాపు ముగింపు పలికినట్టైంది.

కరాచీలో జన్మించిన హసన్ రజా పాకిస్థాన్ తరఫున మొత్తం ఏడు టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో రెండు అర్ధ సెంచరీలతో 235 పరుగులు చేశాడు. వన్డేల్లో 242 పరుగులు నమోదు చేశాడు. అతని ప్రతిభకు తగ్గ స్థాయిలో విజయాలు రాకపోయినా, చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అరుదైన ఆటగాడిగా హసన్ రజా పేరు మాత్రం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్...

CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే

CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో...

Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్‌లో లేవనెత్తుతానని హామీ

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆటో అవతారమెత్తారు....

Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న...