12
February, 2026

A News 365Times Venture

12
Thursday
February, 2026

A News 365Times Venture

Coffee for Memory: మతిమరుపునకు చెక్.. 40 ఏళ్ల పరిశోధనలో తేలిన మైండ్ బ్లోయింగ్ విషయాలు!

Date:

చాలామందికి పొద్దున్నే లేవగానే వేడివేడి కాఫీ కప్పు పడకపోతే అసలు రోజే మొదలైనట్టు ఉండదు. పని ఒత్తిడిలో ఉన్నా, మధ్యాహ్నం నిద్ర ముంచుకొస్తున్నా అందరికీ గుర్తొచ్చే మొదటి ఆప్షన్ కాఫీ. ఇప్పటిదాకా కాఫీని కేవలం ఒక ఎనర్జీ బూస్టర్‌గానే లేదా మూడ్ సెట్ చేసే డ్రింక్‌గానే చూశాం. కానీ, ఇప్పుడు సైన్స్ దీనికి ఒక అద్భుతమైన ‘లైఫ్ సేవింగ్’ ట్యాగ్ ఇచ్చింది. సుమారు 43 ఏళ్ల పాటు సాగిన ఒక భారీ వైద్య పరిశోధనలో కాఫీకి సంబంధించి అదిరిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ పరిమితంగా కాఫీ తాగే అలవాటు ఉన్నవారికి, వయసు మళ్లాక వచ్చే మతిమరుపు (Dementia) ముప్పు చాలా వరకు తగ్గుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

ప్రముఖ అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘జామా’ (JAMA) ప్రచురించిన ఈ నివేదిక ప్రకారం, రోజూ కాఫీ తాగే వారిలో మతిమరుపు వచ్చే అవకాశం 18 నుంచి 20 శాతం మేర తగ్గింది. ఇది ఏదో ఒకట్రెండు రోజులు చేసిన రీసెర్చ్ కాదు.. దాదాపు 1.3 లక్షల మందిని సుదీర్ఘంగా 43 సంవత్సరాల పాటు గమనించి ఈ నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా ఇందులో కాఫీలో ఉండే ‘కెఫీన్’ పాత్ర అత్యంత కీలకమని పరిశోధకులు గుర్తించారు. ఎందుకంటే కెఫీన్ లేని (Decaf) కాఫీ తాగిన వారిలో ఇలాంటి సానుకూల మార్పులేవీ కనిపించలేదు. కెఫీన్ మెదడులోని నరాలను ఎప్పుడూ చురుగ్గా ఉంచుతూ, ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కవచంలా పనిచేస్తున్నట్లు ఈ అధ్యయనం వివరించింది.

ఎంత తాగాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
అయితే కాఫీ మంచిది కదా అని గంటకో కప్పు తాగేస్తే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం, రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల మాత్రమే మెదడుకు పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. అంతకంటే ఎక్కువ తాగితే నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాఫీని ఒక ఔషధంలా భావించి పరిమితంగా తీసుకుంటేనే దాని ఫలితం ఉంటుంది. అలాగే, కేవలం కాఫీ ఒక్కటే మీ మెదడును కాపాడలేదు. క్రమం తప్పని వ్యాయామం, కంటినిండా నిద్ర, పోషకాహారం కూడా తోడైనప్పుడే జ్ఞాపకశక్తి చెక్కుచెదరకుండా ఉంటుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ, మీ ఫేవరెట్ కాఫీని ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చుకోండి.

గమనిక: కాఫీ లేదా కెఫీన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు. మీకు గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు (BP), నిద్రలేమి లేదా గర్భధారణ వంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే, మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్ లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. అతిగా కాఫీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gold Rates: దిగొచ్చిన పుత్తడి ధర.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. శుభకార్యాల సమయంలో బంగారం...

Bangladesh: నేడు బంగ్లాదేశ్ ఎన్నికలు.. సాయంత్రం నుంచే ఫలితాలు

రాజకీయ సంక్షోభం, హింస, హిందువుల హత్య తర్వాత గురువారం బంగ్లాదేశ్‌లో ఎన్నికలు...