పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరుడైన కాన్పూర్ కి చెందిన శుభం ద్వివేది ఇంటికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేరుకున్న విషయం తెలిసిందే. సీఎం రాకతో అక్కడ వాతావరణం చాలా భావోద్వేగంగా మారింది. ఈ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. ముఖ్యమంత్రిని చూడగానే శుభం భార్య ఐష్ణయ కన్నీరుమున్నీరైంది. వణుకుతున్న స్వరంతో “సార్.. మేము ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం.’ అన్నారు. ఆ భావోద్వేగ మాటలు విని ముఖ్యమంత్రి యోగి కూడా తనను తాను నియంత్రించుకోలేకపోయారు.
శుభం తండ్రి తన కొడుకు గురించి చెప్పినప్పుడు.. ముఖ్యమంత్రి అతడిని ఓదార్చారు. ఆ కుటుంబం దుఃఖాన్ని చూసి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి యోగి సాధ్యమైనంత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సీఎం యోగి శుభం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. అందులో సీఎం యోగి భావోద్వేగానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. తన కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చారు. ఈ వీడియో చూసిన చాలా మంది జనాలు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా.. కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది అంత్యక్రియలు గురువారం ముగిశాయి. వేలాది మంది ప్రజల సమక్షంలో దేవోరి ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
READ MORE: Gopichand : ప్లాపుల నిర్మాత బ్యానర్ లో ప్లాప్ స్టార్ సినిమా షురూ
आज जब 'रोते' हुए बाहर निकले CM योगी जी
पहलगाम में मारे गए शुभम द्विवेदी को श्रद्धांजलि देकर
व उनके 'परिजनों' से मिलने के बाद भावुक योगी जी
pic.twitter.com/OX5tAopf6r
— Narendra Modi Fan (@narendramodi177) April 24, 2025