10
March, 2026

A News 365Times Venture

10
Tuesday
March, 2026

A News 365Times Venture

CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

Date:

CM Revanth Reddy : హైడ్రా పునరుద్దరించిన నల్ల చెరువుకు గంగా హారతి ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు కలుషితమై, కబ్జాలకు గురైన నల్ల చెరువు నేడు సుందరమైన పర్యాటక ప్రాంతంగా మారడం తనకెంతో సంతోషాన్నిస్తోందని అన్నారు. తాను గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్న సమయంలో నిధుల కొరత వల్ల చేయలేకపోయిన అభివృద్ధిని, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు..

హైడ్రా కార్యకలాపాలు ప్రారంభించిన సమయంలో ఎదురైన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. అప్పట్లో తనపై వచ్చిన ఆరోపణలను మౌనంగా భరించానని, కానీ నేడు ఈ మార్పును చూసి ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆనందం తనకు ఆశీర్వాదంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. చెరువుల పరిరక్షణలో భాగంగా అనివార్యంగా నివాసాలు కోల్పోయిన పేదల పట్ల ప్రభుత్వం ఉదారంగా ఉంటుందని, వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చెరువులు కబ్జాకు గురైతే భవిష్యత్తులో వరదలు వచ్చి సామాన్య ప్రజల ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని, అందుకే ఆక్రమణదారులు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ పునరుద్ధరించిన ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు స్టాల్స్ ఏర్పాటు చేయాలని, అలాగే స్థానికుల కోరిక మేరకు షటిల్ కోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Bengaluru Hotels Shutdown: హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ నిలిపివేత.. రేపు హోటల్స్‌ బంద్‌కు పిలుపు

నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘మూసీ ప్రక్షాళన’ ఎంత అవసరమో ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఢిల్లీలో కాలుష్యం వల్ల పార్లమెంటుకు, స్కూళ్లకు సెలవులు ఇచ్చే దుస్థితి వచ్చిందని, ముందుచూపు లేకపోవడం వల్లే ముంబై వంటి నగరాలు వర్షం పడితే స్తంభించిపోతున్నాయని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకూడదంటే మూసీ నదిని శుభ్రం చేయాల్సిందేనని, దీనిని అడ్డుకోవడం అంటే నగర భవిష్యత్తును అడ్డుకోవడమేనని హెచ్చరించారు. అభివృద్ధి కోసం ఎంతటి కష్టమైనా పడతానని, అవసరమైతే అప్పు తెచ్చైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని భావోద్వేగంగా మాట్లాడారు. సరైన పత్రాలు ఉన్న వారికి టీడీఆర్ (TDR) ఇస్తామని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

Off The Record: గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తనకంటూ ఒక...

Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆత్మహత్యలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది....

Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

Off The Record: కొలుసు పార్థసారథి…ఉమ్మడి కృష్ణాజిల్లాలో నూజివీడు నియోజకవర్గం నుంచి...