తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో భూ భారతి పోర్టల్ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “పండగ వాతావరణంలో భూ భారతీ ప్రజలకు అంకితం చేస్తున్నాం.. సంతోషంగా ఉంది.. భూమి కోసమే ఎన్నో ఉద్యమాలు వచ్చాయి..
Also Read:Lady Aghori: యో* పూజ చేస్తానని మోసం… లేడి ప్రొడ్యూసర్ కి 10 లక్షల టోకరా..
పోరాటాల నుంచే రెవెన్యూ చట్టాలు వచ్చాయి.. రెవెన్యూ వ్యవస్థ ఉన్నది దోచుకోవడానికి అని చిత్రీకరించే పని గత ప్రభుత్వం చేసింది.. ఉన్న ఫలంగా ధరణి వచ్చిన తర్వాతనే.. రెవెన్యూ వాళ్ళు దొంగలు.. దోపిడి దారులుగా కనిపించారా..?ఎక్కడైనా కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు.. అంత మాత్రానా అందరిని అంటామా.. ఇంట్లో ఎలుక వస్తె.. ఇల్లు తగలబెట్టుకుంటామా.. గత ప్రభుత్వం చట్టాలు మార్చి.. కొందరికి చుట్టాలుగా మార్చింది.. మన చట్టం పేదలకు బంధువుగా ఉండాలి.. భూ భారతీ రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.. ఆనాడు తెచ్చిన ధరణి తెలంగాణ ప్రజలకు పీడకలగా మారింది.. రెవెన్యూ సిబ్బందిపై నెపం వేసి లబ్ధి పొందాలని చూశారు.. మొదటి విడత నాలుగు మండలాలు పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేద్దాం..
Also Read:SIT Raids: మూడు చోట్ల సిట్ సోదాలు.. దొరకని కసిరెడ్డి ఆచూకీ
కలెక్టర్ ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టాలి.. సమస్యలు పరిష్కారం చేయాలి.. చట్టాలు చేసేంత వరకు మా బాధ్యత.. అమలు చేసేది రెవెన్యూ అధికారులే.. అందుకే మీ సమక్షంలో భూ భారతీ పోర్టల్ ప్రారంభించాము.. రెవెన్యూ సిబ్బందిని మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం.. దొంగలు ఉంటే వాళ్ళ పట్ల కటినంగా ఉంటాం.. మీకు సోదరుడిగా ఉంట.. మేము చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా చేసే పనికి నేను వ్యతిరేకం.. అక్కడో ఇక్కడో .. ఉంటారు తప్పులు చేసే వాళ్ళు.. వాళ్ళ పట్ల కటినంగా ఉంట.. గత ముఖ్యమంత్రి మిమ్మల్ని దోషులుగా చిత్రీకరించారు.. ఇదెక్కడి పద్ధతి.. ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళను సమాజానికి దూరంగా ఉంచండి..
Also Read:LSG vs CSK: రాణించిన పంత్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
కలెక్టర్ లు.. మీ ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవం.. మేము.. మీరు వేరు వేరు కాదు.. తెలంగాణ లో రైతులు..రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు.. ఆధార్ మనిషికి.. భూమికి భూదార్.. ప్రతి భూమికి కార్డు ఇస్తాం.. కొలతలు వేసి.. సరిహద్దులు గుర్తిద్దాం.. తెలంగాణ హద్దునే నిర్ణయించిన రెవెన్యూ వాళ్ళు.. భూముల హద్దులు గుర్తించలేరా..?.. మనం ఏ తప్పు చేయొద్దు.. రైతులు మనం ఊరికి వెళ్తే ఇంత భోజనం పెట్టీ పంపేలా పని చేయండి.. కలెక్టర్ లు ప్రతీ మండలం పర్యటన చేయాల్సిందే.. అందరీ సహకారం తీసుకుని పని చేయండి” అని సీఎం రేవంత్ అన్నారు.