9
April, 2025

A News 365Times Venture

9
Wednesday
April, 2025

A News 365Times Venture

CM Chandrababu: ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరుతూ పీయూష్ గోయల్‌కు లేఖ

Date:

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగానికి అండగా నిలవాలని కోరుతూ లేఖ రాశారు. ఈ సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి.. రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తుందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరారు. భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా దేశ ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధించింది.

Also Read:Health Tips: బెల్లాన్ని ఆహారంలో చేర్చుకుంటే.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్ల డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారతదేశంపై 27 శాతం దిగుమతి సుంకం కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతుంది. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే అమెరికా విధిస్తోంది. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ….వారికి అనుకూలంగా మారుతోంది. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ (CVD) భారాన్ని మోస్తున్నారు.

Also Read:Bhadradri : భద్రాచలంలో ఘనంగా రాములోరి కళ్యాణం.. భారీగా ట్రాఫిక్ జాం

అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్‌కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటుంది. అమెరికా విధించిన కొత్త సుంకం ఏప్రిల్ 5, 2025 నుండి అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అమెరికా దేశానికి వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోంది. గతంలో వచ్చిన ఆర్డర్‌లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేయబడి, కోల్డ్ స్టోరేజ్ లు, పోర్టులలో ఉన్నాయి. కొత్త నిబంధనల వల్ల ఈ ఉత్పత్తులపై సుంకాల భారం పడుతుంది. వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాల మార్కెట్లు భారతదేశం నుండి సీ ఫుడ్‌ను కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయి.

Also Read:Bhadradri : భద్రాచలంలో ఘనంగా రాములోరి కళ్యాణం.. భారీగా ట్రాఫిక్ జాం

అయితే నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్సుల కారణంగా ఆ దేశాలు కూడా మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయి. ఏపీలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితిలో రైతాంగం ఉంది. మరోవైపు ఇంకో పంట సిద్ధంగా ఉంది. 27 శాతం సుంకాల కారణంగా రైతుల నుండి పంట సేకరిచడం ఎగుమతిదారులు నిలిపివేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి.

Also Read:Parenting Tips: పిల్లల వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు చేయాల్సిన పనులు ఇవే!

ఈ పరిణామాలతో ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు….ఇలా అందరికీ సమస్యలు వచ్చాయి. ఈ కారణంగా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్చలు జరపాలి అని కోరుతున్నాను. సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకోవాలి.. సమస్య పరిష్కరించడం వల్ల ఆక్వాపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది జీవనోపాధిని కాపాడవచ్చు అని లేఖలో పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jagadish Reddy: వాళ్లు తెలంగాణ నీళ్లను దొంగిలించుకుని పోతున్నారు..

Jagadish Reddy: తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి...

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

రాజధాని ప్రాంతంలో సీఎం కొత్త ఇంటికి శంకుస్థాపన.. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఎంతో...

Online Love: ఆన్‌లైన్ ప్రేమికుడి కోసం ఏపీ వచ్చిన అమెరికా యువతి

ఆన్‌లైన్ ప్రేమికుడి కోసం అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరో అనే యువతి...

Kakkireni Bharath Kumar: యువతకు ఆదర్శంగా యువ ఆంత్ర ప్రెన్యూర్.. భరత్ కుమార్ కక్కిరేణి!

Kakkireni Bharath Kumar: మీరు చేయగలిగిన అత్యుత్తమ పెట్టుబడి మీలోనే ఉంది.....