CLP Meeting: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకున్న సందర్భంలో కాంగ్రెస్ శాసనసభ పక్షం (CLP) కీలక సమావేశానికి రంగం సిద్ధమైంది. ఈ సమావేశం రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ శాసనపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక ప్రజాహిత పథకాలపై సమీక్ష జరుగనుంది.
Read Also: Anna Lezhneva: అన్నదాన సత్రానికి మార్క్ శంకర్ పేరు మీద రూ. 17 లక్షల విరాళం..
ఈ సీఎల్పీ సమావేశంలో భూభారతి పథకం, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు పథకం, ఎస్సీ అండ్ ఎస్టీ వర్గీకరణ క్యాటగరైజేషన్ పై చర్చించనున్నారు. ఈ విషయాలే కాక , రాష్ట్రంలో నెలకొన్న ఇతర ప్రాధాన్యమైన అంశాలపై కూడా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అభిప్రాయాలు పంచుకోనున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేయనున్న ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో విశేష ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తున్నారు.