12
October, 2026

A News 365Times Venture

12
Monday
October, 2026

A News 365Times Venture

CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!

Date:

CJP: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో అక్టోబర్ 10 శనివారం భారీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే, ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలతో సీజేపీ ప్రయత్నాలను వమ్ము చేశారు. ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను విమానంలోనే అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు.

ఇదిలా ఉంటే, విమానంలో పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో హైడ్రామా నెలకొంది. తోటి ప్రయాణికుల నుంచి సీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఈ వీడియోను పంచుకుంటూ.. ‘‘పౌరుల ద్వారానే చెత్త నియంత్రణ’’ అంటూ కామెంట్ చేశారు. ప్రయాణికులు సీజేపీ లీడర్లను ఉద్దేశించి ‘‘మీకు సిగ్గుండాలి’’, ‘‘స్వచ్ఛ భారత్, చెత్తను శుభ్రం చేయండి’’ అని కామెంట్స్ చేశారు. ఈ వీడియోను ఉద్దేశిస్తూ తేజస్వీ సూర్య.. ‘‘సీజేపీ గురించి నిజమైన పౌరులు ఏంటున్నారో వినండి’’ అని కామెంట్ పోస్ట్ చేశారు.

వీడియోలో అభిజిన్ తనను అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ విసురుతూ.. తనపై UAPA, NSA కేసులు పెట్టుకోండి అంటూ నిరసన తెలిపారు. సీజేపీ కోకన్వీనర్ సౌరవ్ దాస్ ఒక మహిళా ప్రయాణికురాలితో ‘‘షేమ్ అన్ యూ’’ అంటూ కామెంట్ చేయగా, మహిళ తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘షేమ్ ఆన్ యూ’’ అని బదులు ఇచ్చింది. మరో ప్యాసింజర్ ‘‘కచరా సాఫ్, స్వచ్ఛ భారత్ అభియాన్’’అని అంటుండటం వినొచ్చు. సీజేపీ నేతల అరెస్ట్ డ్రామాతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!

Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. రెండు దేశాల...

Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత,...

Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్‌ వాంగ్‌చుక్ అల్టిమేటం.!

Sonam Wangchuk: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల నేపథ్యంలో ఢిల్లీ...

Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..

హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీసు స్టేషన్ పరిధిలో దిగ్భ్రాంతికర సంఘటన వెలుగుచూసింది. ఓ...