మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. ఆయన స్క్రిప్ట్ లాక్ చేసినట్లుగా ఒక ప్రకటన విడుదల చేశాడు కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది.
Odela 2: ‘ఓదెల 2’కు భారీ షాక్!
అదేమంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి ఆపోజిట్‌గా ఒక కుర్ర హీరో విలన్ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఆ కుర్ర హీరో ఇంకెవరో కాదు, ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీలోకి మెరుపు వేగంతో దూసుకొచ్చి, తర్వాత సరైన హిట్ మళ్లీ కొట్టడానికి అనేక ఇబ్బందులు పడుతున్న కార్తికేయ. నిజానికి కార్తికేయ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయనతో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో కార్తికేయకు తగ్గ పాత్ర ఒకటి దొరకడంతో ఆయనను ఈ సినిమాలో భాగం చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. మరి అందులో ఎన్ని నిజమవుతాయో, ఎన్ని ప్రచారానికి పరిమితమవుతాయో చూడాల్సి ఉంది.