Chiken Biryani: నోయిడాకు చెందిన ఓ మహిళకు రెస్టారెంట్ వెజ్ బిర్యానీకి బదులుగా చికెన్ బిర్యానీని అందించింది. పూర్తిగా శాఖాహారి అయిన మహిళ ఏడుస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాయా శర్మ అనే మహిళ స్విగ్గీ ద్వారా రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే, నవరాత్రి సందర్భంగా నాన్-వెజ్ బిర్యానీ వచ్చిందని, ఇది ఉద్దేశపూర్వకంగా రెస్టారెంట్ చేసిందని ఆరోపించింది.
Read Also: Vijay-Rashmika : మళ్లీ దొరికేసిన విజయ్, రష్మిక.. ఇంకెన్నాళ్లు దాస్తారు..?
‘‘నేను స్విగ్గీ నపుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. లక్నోయి కబాబ్ పరాట అనే రెస్టారెంట్ ఆమ్రపాలి లీజర్ వ్యాలీ, సెక్టార్ 2లో ఉంది. కానీ నాకు నాన్ వెజ్ బిర్యానీ వచ్చింది’’ అని ఆమె అన్నారు. ఛాయా శర్మ ఏడుస్తూ.. వెజ్ బిర్యానీ అనుకుని తాను కొద్దిగా చికెన్ బిర్యానీని తిన్నాను అని, తాను పూర్తిగా శాఖాహారిని అని, రెస్టారెంట్ వారు కావాలనే నవరాత్రుల సమయంలో తనకు నాన్ వెజ్ బిర్యానీని పంపారని ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆమె ఆరోపించారు. ఆర్డర్ చేసిన తర్వాత, రెస్టారెంట్ మూసివేశారని, తన కాల్స్‌కి సమాధానం ఇవ్వలేదని ఆమె చెప్పింది. దీనిపై పోలీసులు స్పందించి రెస్టారెంట్ సిబ్బందిని అరెస్ట్ చేశారు.
ग्रेटर नोएडा की छाया शर्मा ने स्विगी से वेज बिरयानी ऑर्डर की, लेकिन घर पर आई चिकन बिरयानी।
छाया कहती हैं– उन दिनों नवरात्र चल रहे थे। मैं प्योर वेजेटेरियन हूं। मैंने गलती से एक–दो बाइट खा भी ली। pic.twitter.com/tePjKQar0s
— Sachin Gupta (@SachinGuptaUP) April 7, 2025