12
February, 2026

A News 365Times Venture

12
Thursday
February, 2026

A News 365Times Venture

Chandrababu and Pawan Kalyan: కూటమి ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Date:

Chandrababu and Pawan Kalyan: కూటమి ఎమ్మెల్యే ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఇంకా పూర్తిగా కోలుకున్నాం అని అనుకోవద్దని ఎమ్మెల్యే లకు సూచించారు… గుజరాత్ తరహాలో ఎప్పటికి అధికారంలో ఉండాలంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు.. ఈ రోజు కూటమి ఎమ్మెల్యే లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు.. తాజా రాజకీయ పరిణామాలు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి వివరించారు.. ఎమ్మెల్యేలు అందరూ అలెర్ట్ గా ఉండాలన్నారు. తాను సభ మొత్తం గమనిస్తా అన్నారు. సభ్యులు అందరూ అన్ని శాఖలపై పట్టు సంపాదించాలన్నారు.. ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో… దీర్ఘ కాలం అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు.

మూడు పార్టీలు ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగామని.. నాడు ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు ఇస్తున్నామంటే కేంద్రం ఎంతో సహకారం అందిస్తోందన్నారు.. అందుకే వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టామన్నారు. కేంద్రం అమరావతి, పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే నేడు ఈ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేవి కాదన్నారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకిత చేస్తున్నామంటే కారణం కేంద్ర సాయం అన్నారు చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర సాయంతో నిలబెట్టాం. మన కోసం, మన ఏపీ కోసం, మన విశాఖ కోసం కేంద్రం తన పాలసీనే మార్చుకుని సాయం చేసిందన్నారు.. ఇది చిన్న వ్యవహారం కాదన్నారు. కేంద్ర సాయంతో మొదటి సారి రూ.54 కోట్ల లాభాలను విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించిందన్నారు చంద్రబాబు.

మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఫలితాలను ఇస్తున్నాయని.. మనం పూర్తిగా కోలుకున్నాం అనుకోవద్దన్నారు చంద్రబాబు… కానీ, వ్యవస్థలను గాడిన పెట్టామని.. 20 నెలల్లో నాయకత్వంలో ఎక్కడా విభేదాలు లేవన్నారు చంద్రబాబు.. ఇది ఎంతో మంచి పరిణామమని.. మన యూనిటీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నారు చంద్రబాబు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో ఉండాలని… నిబద్ధత లేకపోతే ఫలితాలు రావన్నారు. వన్ టైమ్, టు టైమ్స్ ఉండిపోవడానికి సిద్దంగా లేమని.. గుజరాత్ లో 5 సార్లు బీజేపీ గెలిచిందన్నారు. ఆ తరహా ఫార్ములా ఇక్కడా అమలవ్వాలన్నారు.. మనలో విశ్వాసం ఉండాలని.. శాశ్వతంగా రాజకీయాల్లో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని.. ఎమ్మెల్యేలకు సూచించారు చంద్రబాబు..

అసెంబ్లీ సమావేశాలను సభ్యులు సీరియస్ గా తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. ఉదయం 9 నుంచి 1 గంట వరకు సభ్యులు అంతా సభలో ఉండాల్సిందే అన్నారు.. తాను కూడా సభను పూర్తిగా ఫాలో అవుతానని… సభ్యుల ప్రసంగాలు వింటా… మంత్రులు సమాధానాలు చూస్తా అన్నారు.. సభలో సబ్జెక్టులపై అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. మా సమస్యలపై మా ఎమ్మెల్యేలు మాట్లాడారు, మంత్రులు సమాధానం చెప్పారు అని ప్రజలు అనుకోవాలన్నారు. విప్‌లు సంతృప్తికరంగా పని చేయాలని.. ఎదుటివారు తిట్టారని మనం కూడా బూతులు తిట్టకూడదన్నారు.. ప్రజల ఆమోదయోగ్యంగా సభ జరగాలన్నారు. మొన్నటి ఎన్నికల కంటే నేడు కూటమి బలం పెరిగిందని.. సంక్షేమ, అభివృద్ధితో 20 నెలల్లో మన బలం, ప్రజల మద్దతు మరింత పెరిగిందన్నారు. దీన్ని మీరంతా సానుకూలంగా తీసుకోవాలని… మరింత కష్టపడి పనిచేయాలన్నారు. చేసిన పనులకు ఎమ్మెల్యేలు ఓనర్షిప్ తీసుకోవాలని.. కేంద్రం చేసినా, రాష్ట్రం చేసినా ఓనర్షిప్ తీసుకోవాలని.. రెండు ప్రభుత్వాలు వేర్వేరు కాదని.. 20 నెలల్లో చాలా కష్టపడి ఐక్యంగా పనిచేశామన్నారు చంద్రబాబు.

ఇక, వైసీపీ 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. ప్రగతి వైపు రాష్ట్రాన్ని తీసుకువెళుతున్నాం అన్నారు.. 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటేనే మనం కలిసి ముందుకు వెళ్తాం అన్నారు.. రాష్ట్రం అభివృద్ది జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో.. భవిష్యత్‌లో అలాగే పనిచేయాలన్నారు. ఐక్యంగా ఉండి రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నారు. భిన్నమైన అభిప్రాయాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా కూర్చుని మాట్లాడుకుందామని.. కూటమి ధర్మాన్నికి ప్రతి ఒక్కరం కట్టుబడి బడి పని చేద్దాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Bangladesh: నేడు బంగ్లాదేశ్ ఎన్నికలు.. సాయంత్రం నుంచే ఫలితాలు

రాజకీయ సంక్షోభం, హింస, హిందువుల హత్య తర్వాత గురువారం బంగ్లాదేశ్‌లో ఎన్నికలు...

Bangladesh Elections: బంగ్లాదేశ్‌లో రేపు చారిత్రాత్మక ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయి.

Bangladesh Elections: బంగ్లాదేశ్‌లో అత్యంత కీలక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ దేశ...

Off The Record: మౌనం వీడని ఆ జిల్లా వైసీపీ లీడర్స్.. భయమా? వ్యూహమా?

Off The Record: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ బలహీనంగా...

Off The Record: ఎస్.కోట టీడీపీలో మూడు గ్రూపుల మంట..

Off The Record: విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీలో ప్రస్తుతం మూడు...