20
April, 2026

A News 365Times Venture

20
Monday
April, 2026

A News 365Times Venture

Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

Date:

చాలామంది వాహన దారులు చేసే పని ఏంటంటే.. బండి కొన్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఆ తర్వాత ఏటా దాన్ని రిన్యూవల్ చేసుకుంటూ వెళ్తారు. అది మెయిల్ బాక్స్‌లోనో, కారు డాష్ బోర్డులోనో అలా పడి ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఎప్పుడైనా అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడో, లేక వర్షాలకు కారు నీటిలో మునిగిపోయినప్పుడో అప్పుడు గుర్తొస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ.

మనం క్లెయిమ్ అడిగినప్పుడు కంపెనీ వాళ్లు “ఇది వర్తించదు”, “సగం డబ్బులే వస్తాయి” అని చెప్పినప్పుడు అసలు గందరగోళం మొదలవుతుంది. మనకు కోపం వస్తుంది, కంపెనీ వాళ్లు మోసం చేస్తున్నారనిపిస్తుంది. కానీ అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసా? మనం పాలసీ తీసుకునేటప్పుడు అందులో ఏముందో సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. ఈ రోజు మనం కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి కారణాలు, మనం చేసే చిన్న చిన్న తప్పుల గురించి వివరంగా మాట్లాడుకుందాం.

క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది..?
కవర్ ష్యూర్ (CoverSure) సీఈఓ సౌరభ్ విజయవర్గియా చెప్పిన దాని ప్రకారం.. 10 క్లెయిమ్ రిజెక్ట్ కేసుల్లో 9 కేసులు మనం కాస్త జాగ్రత్తగా ఉంటే నివారించదగ్గవే. అవేంటంటే.. చాలామంది రిన్యూవల్ డేట్ మర్చిపోతారు. పాలసీ గడువు ముగిసిన తర్వాత యాక్సిడెంట్ అయితే కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో డ్రైవర్ దగ్గర చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకపోయినా లేదా లైసెన్స్ గడువు ముగిసిపోయినా క్లెయిమ్ రాదు.

కారులో ఎక్స్‌ట్రాగా సిఎన్‌జి (CNG) కిట్ వేయించినా లేదా ఖరీదైన మ్యూజిక్ సిస్టమ్, అలాయ్ వీల్స్ వంటివి పెట్టినా ఆ విషయం ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి. చెప్పకుండా క్లెయిమ్ అడిగితే వారు తిరస్కరించే అవకాశం ఉంది.

చాలా సార్లు క్లెయిమ్ రిజెక్ట్ అవ్వదు కానీ, మనం గ్యారేజీలో పెట్టిన ఖర్చులో సగం డబ్బులే కంపెనీ ఇస్తుంది. దీనికి కారణం ‘డిప్రిసియేషన్’. అంటే బండి పాతబడే కొద్దీ దాని విడిభాగాల విలువ తగ్గుతుంది. ఉదాహరణకు, మీ కారు బంపర్ మార్చాల్సి వస్తే, ఆ బంపర్ పాతది కాబట్టి దాని అసలు ధరలో 50 శాతం మాత్రమే కంపెనీ భరిస్తుంది. మిగతాది మీ జేబులో నుంచే పెట్టుకోవాలి. ఇది తెలియని చాలామంది చెక్కు చేతికి వచ్చాక షాక్ అవుతుంటారు.

Also Read:Strait of Hormuz: హర్మూజ్ జలసంధి.. ప్రపంచానికి ప్రాణవాయువు ఎలా అయింది.. అసలు రహస్యం ఇదే..

‘కాంప్రహెన్సివ్’ అంటే అన్నీ వస్తాయని అనుకోకండి..
మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు “కాంప్రహెన్సివ్ పాలసీ” అని తీసుకుంటాం. అంటే అన్నింటికీ రక్షణ ఉంటుందని మన నమ్మకం. కానీ ఇది నిజం కాదు. వర్షాల వల్ల రోడ్లపై నీళ్లు నిలిచినప్పుడు కారు నడిపితే, ఇంజిన్‌లోకి నీళ్లు వెళ్లి అది ఆగిపోతుంది (దీనిని హైడ్రోస్టాటిక్ లాక్ అంటారు). మామూలు పాలసీలో దీనికి పైసా రాదు. కారు పార్కింగ్‌లో ఉండి నీళ్లలో మునిగితే బయటి బాడీకి వచ్చే డ్యామేజీకి డబ్బులు వస్తాయి కానీ, లోపల ఇంజిన్ పాడైతే మాత్రం అదనపు కవర్ లేకపోతే కష్టం.

మీ క్లెయిమ్‌ను కాపాడే ‘యాడ్-ఆన్స్’ ..
పాలసీ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రీమియం కడితే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. జీరో డిప్రిసియేషన్ .. ఇది ఉంటే ప్లాస్టిక్ లేదా ఫైబర్ పార్ట్స్ మార్చినా కంపెనీ పూర్తి డబ్బులు చెల్లిస్తుంది. మీ జేబు నుంచి ఖర్చు ఉండదు. ఇంజిన్ ప్రొటెక్షన్… వర్షాలు ఎక్కువగా పడే నగరాల్లో ఉండేవారికి ఇది వరం. ఇంజిన్ రిపేర్ వస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఈ చిన్న యాడ్-ఆన్ మిమ్మల్ని ఆ ఖర్చు నుంచి కాపాడుతుంది.

యాక్సిడెంట్ అయ్యాక మనం చేసే తప్పులు…
యాక్సిడెంట్ జరగగానే కంగారులో మనం కొన్ని తప్పులు చేస్తాం. ఇన్సూరెన్స్ కంపెనీ వారు వచ్చి చూడకముందే బండిని రిపేర్ చేయించేయడం అతిపెద్ద తప్పు. అలా చేస్తే అసలు ఏం జరిగిందో కంపెనీకి తెలియదు కాబట్టి క్లెయిమ్ ఆపేస్తారు. ప్రమాదం జరిగిన చోట ఫోటోలు తీసి పెట్టుకోవాలి. సాక్ష్యం లేకపోతే కొన్నిసార్లు క్లెయిమ్ ప్రాసెస్ లేట్ అవుతుంది.

క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి..?
ఒకవేళ మీ క్లెయిమ్ రిజెక్ట్ అయినా భయపడాల్సిన పని లేదు. అది ఫైనల్ కాదు. ముందుగా కంపెనీలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి. అక్కడ పని కాకపోతే IRDAI కి ఫిర్యాదు చేయవచ్చు. అన్నింటికంటే ఉత్తమమైన మార్గం ‘ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్’. వీరు ఉచితంగా మీ కేసును విచారిస్తారు. రూ.50 లక్షల వరకు ఉన్న వివాదాలను వీరు పరిష్కరిస్తారు.

ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు రక్షణ ఇవ్వడానికే ఉన్నాయి. కానీ మనం పాలసీ కాగితాలు చదవకుండా, ఏవి కవర్ అవుతాయో తెలుసుకోకుండా ఉంటే నష్టపోయేది మనమే. అందుకే, బండికి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు ప్రీమియం తక్కువగా ఉందని చూడకుండా.. క్లెయిమ్ సక్రమంగా వచ్చే ఫీచర్లు ఉన్నాయో లేదో చూసుకోండి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Iran-US: ఇరాన్-యూఎస్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. నౌకలపై పరస్పర దాడులు

ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హార్ముజ్‌లో ఇరాన్‌ సరుకు రవాణా...

PBKS vs LSG: బౌలర్లను ఉతికారేసిన ప్రియాంశ్ ఆర్య, కనోలీ.. లక్నో ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా 29వ మ్యాచ్ ఈరోజు, ఆదివారం,...

US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్

US-Iran Talks: అమెరికా-ఇరాన్ శాంతి చర్చల కోసం మరోసారి పాకిస్తాన్ రాజధాని...

Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు ఒక శాశ్వత...