Buggana Rajendranath Reddy: సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ.. అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి.. అప్పు.. సంపద పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించిన ఆయన.. కేంద్రంలో మద్దతు ఉంది అని చెప్పుకుంటున్నారు.. కానీ, ఎటువంటి మార్పు లేదు అని దుయ్యబట్టారు.. అప్పు అంత ఉంది ఇంత ఉందని ఎవరు నోటికి ఏదోస్తే అది చెప్తున్నారు.. మట్కా లెక్కల మాదిరి అప్పు లెక్కలు మాట్లాడుతున్నారు అని ప్రజలు అంటున్నారన్నారు.. సంపద సృష్టి అంటున్నారు.. అనుభవం కదా అని ప్రజలు నమ్మారన్నారని పేర్కొన్నారు..
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల హతం
ఇక, వైసీపీ దిగిపోయే నాటికి 81400 కోట్ల పన్ను ఆదాయం ఉంటే.. మా కంటే తక్కువగా మీ ఆదాయం ఉంది అన్నారు బుగ్గన.. మా కంటే 7.5 శాతం తక్కువగా కూటమి ప్రభుత్వం సంపద సృష్టి ఉంది.. సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ చేసింది కూటమి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు.. సామాన్య మానవుడి కోసం మేం పరిపాలన చేశాం.. వైసీపీ అప్పు చేసింది అంటారు.. మా కంటే అప్పు ఎక్కువగా చేసి ఎవరికి పెడుతున్నారు..? అని నిలదీశారు.. జగనన్న ఉన్నపుడు ఉన్న పథకాలు రావడం లేదు.. మీరు ఇస్తామన్న పథకాలు రాలే..? కానీ, సంపద అంతా ఎక్కడికి పోతుంది అంటూ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి…