20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

Bride Flees With Boyfriend: బ్యూటీపార్లర్ వెళ్తానని ప్రియుడితో వధువు జంప్.. కిడ్నాప్‌ అని భర్త ఫిర్యాదు..

Date:

Bride Flees With Boyfriend: మధ్యప్రదేశ్‌లోని గంజ్‌బసోడాలో వధువు తన బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోవడం వార్తల్లో నిలిచింది. రిసెప్షన్‌కి ముందే ప్రియుడితో లేచిపోయింది. రిసెప్షన్ కోసం సిద్ధం కావడానికి బ్యూటీ పార్లర్‌కి వెళ్లిన వధవు, తిరిగి వస్తుండగా కొంత మందితో కలిసి కారులో పారిపోయింది. ముందుగా, తన భార్యను కిడ్నాప్ చేశారని భర్త ఆరోపించాడు, తన భార్యను తిరిగి తీసుకురావడానికి పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించాడు. విచారణలో అసలు నిజం తెలిసి అంతా షాకయ్యారు.

గంజ్‌బసోడాకు చెందిన వధువు, ఆమె ప్రియుడు, అతడి సహాయులతో పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయంపై టిటి నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. టిటినగర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ రాజక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తాను గంజ్‌బసోడాకు చెందిన రోష్ని సోలంకిని పెళ్లి చేసుకున్నానని, మంగళవారం వధువుతో తన ఇంటికి తిరిగి వచ్చినట్లు చెప్పారు. బుధవారం రిసెప్షన్ కోసం ఆశిష్ సోదరితో కలిసి వధువు బ్యూటీపార్లర్‌కి వెళ్లింది, ఆ తర్వాత మండపానికి తిరిగి వచ్చింది. అదే సమయంలో తన భార్యను కొందరు వ్యక్తులు బలవంతంగా వేరే కారులోకి లాక్కెళ్లి అక్కడి నుంచి పారిపోయినట్లు భర్త ఆశిష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి కోసం గంజ్‌బసోడాకు వెళ్ళినప్పుడు తన కారు నాలుగు టైర్లను ఎవరో పంక్చర్ చేశారని అతను ఇంకా చెప్పాడు.

Read Also: CM Chandrababu: మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్స్ తో భేటీకి సిద్ధమైన సీఎం చంద్రబాబు..

టిటినగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సుధీర్ అర్జారియా మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో వధువు స్వయంగా కారులోకి వెళ్లి, పారిపోయినట్లు తేలిందని చెప్పారు. వధువు కాల్ రికార్డుల ప్రకారం, పొరుగున ఉండే అనికేత్ మాలవీయతో సంబంధం పెట్టుకుందని వెల్లడైనట్లు తెలిపారు. బుధవారం వధువు రోష్ని, అనికేత్‌తో చాలాసార్లు మాట్లాడినట్లు తేలింది. వధువు, నిందితుల కోసం రెండు పోలీస్ టీమ్‌లు వెతుకున్నట్లు చెప్పారు. అయితే, మరుసటి రోజు శుక్రవారం, వధువు ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో.. అనికేత్‌తో తన ప్రేమ వ్యవహారం గురించి తన తల్లిదండ్రులకు చెప్పానని, కానీ వారు వినలేదని చెప్పింది. తనకు ఆశిష్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పినట్లు, తనకు తన ప్రియుడికి భద్రత కల్పించాలని కోరింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Industrial Diesel Price Hike: పెట్రోల్ తర్వాత షాకిచ్చిన డీజిల్.. పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా...

Redmi 15A 5G: 6300mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాలతో.. రెడ్‌మీ 15A 5G రిలీజ్ డేట్ ఫిక్స్

షియోమీ సబ్-బ్రాండ్ అయిన రెడ్‌మీ, రెడ్‌మీ 15 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను...

S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!

S.S.Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ తన కెరీర్‌లో ఎందరో దర్శకులతో...

Dhurandhar 2: ధురందర్ 2 లో ఊహించని క్లైమాక్స్‌.. పార్ట్ 3 ఉంటుందా?

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ ఏవైటెడ్ సీక్వెల్ ‘ధురందర్:...