BJP MP: పార్లమెంట్ ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని బుధవారం నుంచి అత్యున్నత న్యాయస్థానం విచారించడం ప్రారంభించింది. ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో చేర్చడం, వక్ఫ్ బై యూజర్ వంటి ఆస్తుల్ని డీనోటిఫై చేయడం వంటి చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు.
తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలోకి ముస్లింయేతరుల నియామకాలు జరగవని కేంద్రం నుంచి సుప్రీంకోర్టుకు హామీ లభించింది. ఇప్పటికే నోటిఫై చేయబడిన లేదా నమోదు చేయబడిన “వక్ఫ్-బై-యూజర్” ఆస్తులతో సహా ఏ వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని, ఈ కాలంలో జిల్లా కలెక్టర్లు వాటి స్థితిని మార్చరని ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా కోర్టు రికార్డ్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు దీనిపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also: Chhattisgarh: దొంగతనం చేశారని.. కార్మికులకు విద్యుత్ షాక్, గోళ్లను ఊడపీకి పైశాచికం..
ఈ వ్యవహారంపై పలువురు బీజేపీ ఎంపీలు సుప్రీంకోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ చట్టాలు చేయాలనుకుంటే, పార్లమెంట్ ఉనికిలో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి అని దూబే ఎక్స్ పోస్టులో పరోక్షంగా సుప్రీంకోర్టు సమీక్షల్ని ప్రస్తావించారు. ఈ చట్టంపై కేంద్రం తన ప్రతిస్పందన తెలియజేయడానికి ఒక వారం సమయం ఇచ్చింది. తదుపరి విచారణ మే 5న జరగనుంది.
1995 వక్ఫ్ చట్టానికి 2025 సవరణల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ, ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్ , కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం వరుసగా రెండవ రోజు కూడా పిటిషన్లను విచారించింది. బుధవారం జరిగిన విచారణలో వక్ఫ్ చట్టంలోని అనేక నిబంధనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని నిబంధనలు రాజ్యాంగ పరిశీలనలో ఉండకపోవచ్చని సూచించింది.
क़ानून यदि सुप्रीम कोर्ट ही बनाएगा तो संसद भवन बंद कर देना चाहिये
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 19, 2025