సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. మీరు కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లైతే ఇదే మంచి సమయం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత రంగంలో అగ్రికల్చర్ సైన్స్/ సాయిల్ సైన్స్ లో B.Sc./ B.Tech./ B.E./ BNYS/ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.
Also Read:Pahalgam Terror Attack: పాకిస్తాన్‌పై ప్రతీకారానికి సిద్ధం.. ఇండియా ముందు ఉన్న దారులు ఇవే..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి మెరిట్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత, అభ్యర్థులను నియామకం కోసం టెక్నికల్ నాలెడ్జ్ అసెస్ మెంట్, ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఈ నియామకంలో కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 75000 జీతం లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 9 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.