20
April, 2026

A News 365Times Venture

20
Monday
April, 2026

A News 365Times Venture

Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్ వస్తువుల సరఫరా..!

Date:

ఆన్‌లైన్‌లో సరుకులు ఆర్డర్ చేస్తే నాణ్యమైన వస్తువులు ఇంటికి వస్తాయని నమ్మే వినియోగదారులకు రాజేంద్రనగర్ బిగ్ బాస్కెట్ (Big Basket) ఘటన ఒక కనువిప్పు. ప్రముఖ ఆన్‌లైన్ గ్రోసరీ సంస్థ బిగ్ బాస్కెట్ గోదాముపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యత పాటించకుండా, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ సంస్థ తీరుపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజేంద్రనగర్‌లోని బిగ్ బాస్కెట్ గోదాములో తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీ ఎత్తున నాసిరకం వస్తువులు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా వినియోగదారులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన మాంసాహారం (Non-Veg) పూర్తిగా పాడైపోయి, దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, గడువు ముగిసిన (Expired) ఆహార పదార్థాలను కూడా కొత్త వస్తువులతో కలిపి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.

 
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
 

ఈ సోదాల్లో మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, సదరు గోదాముకు ఉండాల్సిన ఫుడ్ లైసెన్స్ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కేవలం లాభాల కోసమే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

బిగ్ బాస్కెట్ సంస్థకు ఈ ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న రాజేశ్వరి కంపెనీ పై పోలీసులు , ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల అనంతరం నాసిరకం వస్తువులను సీజ్ చేసిన అధికారులు, నిబంధనలు అతిక్రమించినందుకు బిగ్ బాస్కెట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌పై ఆధారపడే సామాన్యులు, వస్తువులను అందుకునేటప్పుడు వాటి నాణ్యతను , గడువు తేదీలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Iran-US: ఇరాన్-యూఎస్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. నౌకలపై పరస్పర దాడులు

ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హార్ముజ్‌లో ఇరాన్‌ సరుకు రవాణా...

PBKS vs LSG: బౌలర్లను ఉతికారేసిన ప్రియాంశ్ ఆర్య, కనోలీ.. లక్నో ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా 29వ మ్యాచ్ ఈరోజు, ఆదివారం,...

US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్

US-Iran Talks: అమెరికా-ఇరాన్ శాంతి చర్చల కోసం మరోసారి పాకిస్తాన్ రాజధాని...

Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు ఒక శాశ్వత...