12
February, 2026

A News 365Times Venture

12
Thursday
February, 2026

A News 365Times Venture

Bangladesh Elections: బంగ్లాదేశ్‌లో రేపు చారిత్రాత్మక ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయి.

Date:

Bangladesh Elections: బంగ్లాదేశ్‌లో అత్యంత కీలక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ దేశ దశ దిశను మార్చే ఎన్నికలుగా ఇవి ఉండబోతున్నాయి. షేక్ హసీనా 2024లో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత, తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. అప్పటి నుంచి భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు, తాత్కాలిక పాలకుడిగా వచ్చిన మహ్మద్ యూనస్ పచ్చి భారత వ్యతిరేక వైఖరిని అవలంభించాడు. భారత్‌ను వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బంగ్లా వ్యాప్తంగా ఇస్లామిస్టులు రాజ్యమేలుతున్నారు. మతోన్మాద దాడులు, హిందువులపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలకు చాలా ప్రధాన్యత ఏర్పడింది. ఈసారి ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ కూటమికి మధ్య తీవ్ర పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ను యూనస్ సర్కార్ నిషేధించింది. జమాత్ నేతృత్వంలో 11 పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత బంగ్లాదేశ్ వచ్చిన మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్‌ ప్రధాని రేసులో ముందు వరసలో ఉన్నాడు.

ఈసారి డబుల్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంట్లో ఒక ఓటు ఎంపీకి, మరో ఓటు “జులై చార్టర్” రిఫరెండం కోసం. ఈ రిఫరెండం ద్వారా ప్రధాని అధికారాలపై ఆంక్షలు, జ్యుడీషియరీ స్వంతంత్రంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతారు. బంగ్లాదేశ్‌లో 350 సీట్లు ఉండగా, ఇందులో 300 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మరో 50 స్థానాలు మహిళలకు కేటాయించారు. వీటికి పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి.

సర్వేలు ఏం చెబుతున్నాయి.?

* EASD సర్వే (ఢాకా ట్రిబ్యూన్ రిపోర్ట్) ప్రకారం బీఎన్‌పీ అలయన్స్ 208 సీట్లు సాధించి, క్లీన్ స్వీప్ చేస్తుందని చెబుతోంది. జమాత్ అలయన్స్‌కు 46 సీట్లు, జాతియా పార్టీకి 3 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఓట్ షేర్ ప్రకారం చూస్తే.. బీఎన్‌పీకి 66.3 శాతం, జమాత్‌కు 11.9 శాతం ఓట్లు సాధించే ఛాన్స్ ఉందని చెప్పింది.

* ఎన్ఆర్‌సీ సర్వే ప్రకారం.. బీఎన్‌పీ 77 శాతం ఓట్ షేర్‌తో 220 సీట్లు గెలుస్తుందని, జమాత్ 57 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వెల్లడించింది.

* IILD సర్వే (ప్రోథోం ఆలో రిపోర్ట్) మాత్రం బీఎన్‌పీ, జమాత్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని చెప్పింది. జమాత్ అలయన్స్ 105 సీట్లు, బీఎన్‌పీ అలయన్స్ 101 సీట్లు గెలుస్తుందని చెప్పింది. ఓట్ షేర్ బీఎన్‌పీకి 44.1 శాతం, జమాత్ అలయన్స్ 43.9 శాతం వస్తుందని అంచనా వేసింది. 77 సీట్లలో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వే 63,115 ఓటర్లను సర్వే చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Coffee for Memory: మతిమరుపునకు చెక్.. 40 ఏళ్ల పరిశోధనలో తేలిన మైండ్ బ్లోయింగ్ విషయాలు!

చాలామందికి పొద్దున్నే లేవగానే వేడివేడి కాఫీ కప్పు పడకపోతే అసలు రోజే...

Bangladesh: నేడు బంగ్లాదేశ్ ఎన్నికలు.. సాయంత్రం నుంచే ఫలితాలు

రాజకీయ సంక్షోభం, హింస, హిందువుల హత్య తర్వాత గురువారం బంగ్లాదేశ్‌లో ఎన్నికలు...

Off The Record: మౌనం వీడని ఆ జిల్లా వైసీపీ లీడర్స్.. భయమా? వ్యూహమా?

Off The Record: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ బలహీనంగా...