15
July, 2026

A News 365Times Venture

15
Wednesday
July, 2026

A News 365Times Venture

APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!

Date:

APTRANSCO Recruitment: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTRANSCO) శుభవార్త తీసుకవచ్చింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 200 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జులై 20, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం 200 పోస్టుల్లో ఎలక్ట్రికల్ 167, సివిల్ – 23, టెలికాం 10 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో BE లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి. 2026 జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా జరుగుతుంది. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం మెరిట్ జాబితా రూపొందించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్, క్యారెక్టర్ వెరిఫికేషన్ తర్వాత నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000 స్థిర వేతనం చెల్లిస్తారు. ఆపై రూ.86,245 నుంచి రూ.2,08,915 వరకు రెగ్యులర్ పే స్కేల్ వర్తిస్తుంది.

Image (7)

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 30న ప్రారంభమైంది. దరఖాస్తుల చివరి తేదీ జులై 20. హాల్ టికెట్లు పరీక్షకు 7 రోజుల ముందు విడుదల కానున్నాయి. ఆన్‌లైన్ పరీక్షలు ఆగస్టు 22 నుంచి 29 మధ్య నిర్వహించనున్నారు. మెరిట్ జాబితా సెప్టెంబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. అభ్యర్థులు అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు పూర్తి చేయాలి.
అధికారిక వెబ్‌సైట్: https://apvidyutrecruitment.apcfss.in

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్

Virat Kohli: భారత క్రికెట్ జట్టులో మరో కొత్త శకానికి తెరలేచింది....

Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Poha: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు త్వరగా తయారయ్యే, రుచికరమైన వంటకం కావాలంటే అటుకుల...