ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు అలెర్ట్. ఈరోజు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
Alo Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
పదో తరగతి విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అలానే మన మిత్ర వాట్సప్ యాప్, లీప్ మొబైల్ యాప్‌లలో కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి.. విద్యా సేవలను సెలెక్ట్ చేసి, ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అనంతరం రోల్ నంబరు ఎంటర్ చేస్తే.. ఫలితాలు పీడీఎఫ్ రూపంలో వస్తాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ లాగిన్ ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.