23
March, 2026

A News 365Times Venture

23
Monday
March, 2026

A News 365Times Venture

AP News: రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ‘స్లాట్‌ బుకింగ్’ ప్రారంభం!

Date:

ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ‘స్లాట్‌ బుకింగ్‌’ విధానం ప్రారంభం అయింది. స్లాట్‌ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఈరోజు ఉదయం ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏప్రిల్ చివరి లోగా దశలవారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.

‘పరిపాలనా విధి విధానాలు అందరికి అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్తుంటారు. పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నాం. వ్యాపారస్థులు, బిల్డర్లు అందరూ స్టేక్ హోల్డర్లుగా ఉండే రెవెన్యు శాఖలో స్లాట్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు జరిగింది. ఇక నుంచి రోజుల తరబడి వేచి చూసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేస్కోవచ్చు. అమ్మకదారులు, కొనుగోలుదారులు, సాక్షులు.. ఇలా అందరికీ ఇబ్బంది లేకుండా స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. మంచి ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

’26 జిల్లా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యం ఉంటుంది. 290 కి పైగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. రెవెన్యూ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టే అవసరం ప్రభుత్వానికి లేదు. భూ వివాదాలు లేకుండా సంస్కరణలు తీసుకువస్తున్నాం. పారదర్శకంగా ఉండడం కోసమే మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం. అభివృద్ధి కోసం నాలా చట్టాన్ని కూడా తీసేసి కొత్త విధానం తెస్తున్నాం. భూ పరిపాలన, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో మంచి సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. ‘రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నాము. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి తగ్గేలా చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగా స్లాట్ విధానం అమలులోకి తేస్తున్నాము’ అని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Coca‑Cola Price: యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న కోకా కోలా ధరలు..

భారతదేశంలో కోకా కోలా ఉత్పత్తులను బాటిలింగ్  చేసే ప్రధాన సంస్థ ఎస్ఎల్ఎంజీ...

Ragi Chapati: షుగర్‌కు చెక్.. బరువు తగ్గడానికి బెస్ట్ మంత్రం.. ఈ స్టైల్‌లో రాగి చపాతీ తింటే ఫలితం పక్కా!

Ragi Chapati: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం...

Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..

అమెరికా , ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు...

UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!

‘‘ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు’’గా ఉందంటారు కొందరు వ్యక్తులను చూసి....