11
October, 2026

A News 365Times Venture

11
Sunday
October, 2026

A News 365Times Venture

AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..

Date:

ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు పారదర్శకంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన డాక్టర్ NTR వైద్య సేవ పథకంలో అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రులపై ప్రభుత్వం, వైద్య సేవల ట్రస్ట్ కఠిన చర్యలు తీసుకున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి 2026–27 వరకు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 203 నెట్‌వర్క్ ఆసుపత్రులపై మొత్తంగా రూ.34.39 కోట్ల మేర భారీ జరిమానాలు విధించారు. వైద్య సేవల్లో తీవ్రమైన లోపాలు చూపడం, అనుమానాస్పద బిల్లులు దాఖలు చేయడం, రోగుల వద్ద ఉచిత వైద్యానికి అదనపు నిధులు వసూలు చేయడం.. అర్హులైన లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స నిరాకరించడం వంటి చర్యలకు పాల్పడినందుకు గాను ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.

అక్రమాల తీవ్రతను బట్టి చర్యలు చేపడుతూ 25 ఆస్పత్రుల సేవలను తాత్కాలికంగా సస్పెండ్ చేయగా, 13 ఆస్పత్రులకు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. మరో 5 ఆస్పత్రులను నెట్‌వర్క్ జాబితా నుంచే శాశ్వతంగా తొలగించగా, తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఇంకో ఆసుపత్రి గుర్తింపును పూర్తిగా రద్దు చేశారు. ఒక్క గడచిన ఆరు నెలల వ్యవధిలోనే 114 కేసులను విచారించి కఠిన నిర్ణయాలు అమలు చేశారు. పేదల కోసం కేటాయించిన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తోంది.

భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకు NTR వైద్య సేవల ట్రస్ట్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా కల్తీ, నకిలీ , అనుమానాస్పద బిల్లులను త్వరితగతిన గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. రోజుకు వచ్చే దాదాపు 6,000 ముందస్తు వైద్య అనుమతి (ప్రీ-ఆథరైజేషన్) అభ్యర్థనలను రెండు దశల్లోనూ, రోజుకు సమర్పించే 5,600 చికిత్సల బిల్లులను నాలుగు దశల సుదీర్ఘ పరిశీలన ద్వారా తనిఖీ చేస్తున్నారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆసుపత్రులపై చర్యలు చేపడుతున్నారు.

బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ వారి వైద్య రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉచిత సేవలు అందించాల్సిన చోట రోగుల వద్ద నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే సదరు రుసుమును బాధితులకు తిరిగి ఇప్పించడంతో పాటు ఆ మొత్తానికి మూడు రెట్ల జరిమానాను ఆసుపత్రులపై విధిస్తున్నారు. పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి నిజమైన బిల్లులకు చెల్లింపులు త్వరగా పూర్తి చేస్తూనే, అక్రమాలకు తావులేకుండా యంత్రాంగం నిఘా పెంచింది. ఈ మేరకు సమగ్ర వివరాలతో కూడిన నివేదికను ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ సీఈఓ పద్మావతి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అందజేశారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు, పోలీసుల చర్యల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు...

Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..

Yogi Adityanath: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఉత్తర్ ప్రదేశ్ సీఎం...

CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!

CJP Protest:  సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ అక్టోబర్...

CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!

CJP Protest:  ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా...