18
April, 2025

A News 365Times Venture

18
Friday
April, 2025

A News 365Times Venture

Annamalai: అన్నామలైకి జాతీయ స్థాయిలో కీలక పోస్ట్.!

Date:

Annamalai: తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు పొడిచింది. చెన్నైలో ఈ రోజు జరిగిన సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. పళనిస్వామి నేతృత్వంలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇదే రోజు తమిళనాడు బీజేపీ చీఫ్‌గా అన్నామలై దిగిపోయి, కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, తమిళనాడులో బీజేపీకి ఊపు తెచ్చిన పేరు మాత్రం అన్నామలైకి చెందుతుంది. సింగిల్ డిజిట్ ఓట్ షేర్ నుంచి బీజేపీకి డబుల్ డిజిట్ ఓట్ షేర్ సంపాదించడంలో అన్నామలై సక్సెస్ అయ్యారు.

Read Also: Nara Lokesh: టీటీడీ గోశాలలో గోవుల మరణాల ప్రచారంపై మంత్రి నారా లోకేష్ రియాక్షన్..

40 ఏళ్ల మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై పార్టీ చీఫ్‌గా తప్పుకోవడం సంచలనంగా మారిన తరుణంలో, అమిత్ షా వ్యాఖ్యలను బట్టి చూస్తే కేంద్ర స్థాయిలో అన్నామలైకి కీలక పోస్టు లభించే అవకాశం కనిపిస్తోంది. ‘‘తమిళనాడు బీజేపీ యూనిట్ అధ్యక్షుడిగా, కె అన్నామలై ప్రశంసనీయమైన విజయాలు సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలను ప్రజలకు చేరవేసినా లేదా పార్టీ కార్యక్రమాలను గ్రామగ్రామాలకు తీసుకెళ్లినా, అన్నామలై సహకారం అపూర్వమైనది. పార్టీ జాతీయ స్థాయిలో అన్నామలై సంస్థాగత నైపుణ్యాలను బీజేపీ ఉపయోగించుకుంటుంది’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

జూన్ 2021లో అన్నామలై బీజేపీ తమిళనాడు చీఫ్‌గా ఎన్నికయ్యారు. డీఎంకేని ధీటుగా ఎదుర్కొన్న నేతగా అన్నామలై పేరు సంపాదించారు. ‘‘ఎన్ మన్ ఎన్ మక్కల్’’ పాదయాత్ర ద్వారా బీజేపీని తమిళనాడులో ప్రతీ గ్రామానికి తీసుకెళ్లారు. దీని ఫలితంగా బీజేపీ ఓట్ షేర్ పెరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం రాకున్నప్పటికీ ప్రజల ఆదరణ దక్కింది. ఈ ఓట్ షేర్ చూసే ప్రస్తుతం అన్నాడీఎకేం బీజేపీతో పొత్తుకు సిద్ధమైంది. అన్నాడీఎంకే ఉన్న ఓట్ల శాతంతో, బీజేపీ కలిస్తే అధికారం సాధించవచ్చని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

RCB vs PBKS: 14 ఓవర్ల మ్యాచ్.. బ్యాటింగ్ బరిలోకి దిగిన బెంగళూరు..

ఐపీఎల్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య...

Tablet: మేడిన్‌ ఇండియా ‘ట్యాబ్‌’.. కిందపడేసి తొక్కినా పగలదు!

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రతి...

Ponnam Prabhakar : భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Ponnam Prabhakar : హైదరాబాద్ లో ఒక్కసారిగా ఈదురు గాలులు భారీ...

Off The Record : జమ్మలమడుగులో సీఎం మాటకు కూడా విలువ లేకుండా పోతోందా..?

ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మాటకు కూడా విలువ లేకుండా పోతోందా?...