Anna Lezhneva Konidela: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడిన ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల నేడు మొదట తిరుమలలోని గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సైన్ చేశారు. టీటీడీ నియమాల ప్రకారం.. అన్య మతస్థులు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే వారు శ్రీవారిపై నమ్మకం ఉందంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆవిడ డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆవిడ వరాహ స్వామిని దర్శించుకున్నారు.
ఇక ఆదివారం రాత్రి వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాత ఆవిడ దేవుడి ముక్కు నేపథ్యంలో తలనీలాలు సమర్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె శ్రీవారిని దర్శించుకోనున్నారు.