1
March, 2026

A News 365Times Venture

1
Sunday
March, 2026

A News 365Times Venture

Ali Khamenei: ఖమేనీ అంతం.. ఆ 5 ఇరాన్ సుప్రీం లీడర్ ప్రాణం తీశాయా?

Date:

Ali Khamenei: మధ్యప్రాచ్యంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన అలీ ఖమేనీ శకం ముగిసింది. అయితే, ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్‌లో ఖమేనీ సులభంగా చిక్కడానికి ఆయన చేసిన ఐదు ప్రధాన తప్పులే కారణమని అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పులు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Electric Bikes: కాలేజ్ స్టూడెంట్స్ కోసం 5 పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ బైక్స్.. స్పోర్టీ లుక్స్.. హై రేంజ్.. ధరలు ఇవే

* అలీ షంఖానీపై మితిమీరిన నమ్మకం:
ఖమేనీ తన భద్రతా సలహాదారు అలీ షంఖానీని గుడ్డిగా నమ్మడం ఆయన చేసిన మొదటి తప్పు అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. జూన్ 2025లో షంఖానీపై దాడి జరిగినప్పుడే శత్రువుల నిఘా ఆయనపై ఉందని అర్థమైంది. అయినప్పటికీ, షంఖానీ, IRGC చీఫ్ పక్‌పూర్‌లతో ఖమేనీ నేరుగా సమావేశమవ్వడం శత్రువులకు ‘గోల్డెన్ ఛాన్స్’ ఇచ్చింది. షంఖానీ ప్రతి కదలికను ట్రాక్ చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్ శక్తులు, ఆయన ద్వారానే ఖమేనీ ఉన్న లొకేషన్‌ను పక్కాగా గుర్తించగలిగాయని చెబుతున్నారు.

* సురక్షిత బంకర్‌లోకి వెళ్లకపోవడం:
యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అత్యున్నత స్థాయి నాయకులు భూగర్భ బంకర్లలో ఉండటం కనీస భద్రతా నియమం. కానీ, ఖమేనీ తన వ్యక్తిగత భద్రతపై అతివిశ్వాసం ప్రదర్శించారు. నిరంతర డ్రోన్ దాడులు జరుగుతున్నా, ఆయన సురక్షిత ప్రాంతానికి మారకుండా బహిరంగ ప్రదేశంలోనే సమావేశాలు నిర్వహించడం శత్రువులకు పని సులువు చేసింది.

* అమెరికా చర్చలను ‘నిజం’ అని నమ్మడం
అమెరికాతో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు తనను కాపాడతాయని ఖమేనీ భావించారు. చర్చలు జరుగుతున్నంత కాలం తనపై నేరుగా దాడి జరగదని ఆయన వేసిన అంచనా తప్పింది. అమెరికా ఒకవైపు చర్చల నాటకం ఆడుతూనే, మరోవైపు ఖమేనీని అంతం చేసేందుకు వ్యూహాత్మక సమయం కోసం వేచి చూసింది. దౌత్య ప్రక్రియను నమ్మి అప్రమత్తత వదిలేయడం ఆయన చేసిన మూడో తప్పు.

* అణుబాంబుపై ‘ఫత్వా’ – బలహీనతగా మారింది
1990లలో అణ్వాయుధాల తయారీకి వ్యతిరేకంగా ఖమేనీ జారీ చేసిన ‘ఫత్వా’ ఇరాన్‌ను రక్షణ పరంగా వెనక్కి నెట్టింది. ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయదని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. ఇది శాంతి మంత్రంలా కనిపించినా, శత్రు దేశాలు దీనిని ఇరాన్ బలహీనతగా భావించాయి. అణ్వాయుధాలు లేకపోవడం వల్లనే ఇరాన్ నాయకత్వంపై నేరుగా దాడి చేసేందుకు అమెరికా సాహసించగలిగింది.

* మారుతున్న పరిస్థితుల్లో భద్రతా వైఫల్యం
మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదురుతున్నా, అమెరికా-ఇజ్రాయెల్ విధానాలు కఠినతరం అవుతున్నా ఖమేనీ తన పాత భద్రతా పద్ధతులనే అనుసరించారు. మారుతున్న టెక్నాలజీ (డ్రోన్లు, శాటిలైట్ ట్రాకింగ్), శత్రువుల దూకుడును ఆయన తప్పుగా అంచనా వేశారు. ఈ వ్యూహాత్మక నిర్లక్ష్యమే ఆయన 36 ఏళ్ల సుదీర్ఘ పాలనకు విషాద ముగింపు పలికింది.

ఖమేనీ చేసిన ఈ 5 తప్పులు ఇరాన్ చరిత్రను మలుపు తిప్పాయి. ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నడిపిన నాయకుడు, చిన్నచిన్న భద్రతా లోపాలు, అతివిశ్వాసం కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

READ ALSO: Ali Khamenei: ఖమేనీ హత్య వెనుక సౌదీ మాస్టర్ ప్లాన్? ట్రంప్‌ను ఒప్పించింది యువరాజేనా! వాషింగ్టన్ నివేదికలో షాకింగ్ నిజాలు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UAE: “మీ యుద్ధం మాతో కాదు, తెలివిలోకి రండి”.. ఇరాన్‌పై యూఏఈ ఆగ్రహం..

UAE: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా ఖమేనీ హతమయ్యారు....

Xiaomi 17 Ultra: 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో.. షియోమి ఫోన్‌ విడుదల.. ధర ఇదే

Xiaomi 17 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో ప్రారంభించారు. చైనీస్ ఒరిజినల్ పరికరాల...

LPG Cylinder Prices: యుద్ధం వేళ.. పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంతంటే?

ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు చమురు ధరలను సమీక్షిస్తుంటాయి....

Operation Roaring Lion: ఆపరేషన్ రోరింగ్ లయన్.. ఖమేనీతో పాటు ఏడుగురు టాప్ కమాండర్లు ఖతం!

Operation Roaring Lion: ఇరాన్ చరిత్రలో ఫిబ్రవరి 28 – మార్చి...