ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి చేశారు. స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఈ జంటతో నీతా అంబానీ కూడా జత కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ముంబైలో ముదిత్ అదానీ-అనన్య దివాంజీ వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైన బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ఒక బాలీవుడ్ ఫేమస్ పాట సలాం-ఎ-ఇష్క్ పాటకు నృత్యం చేశారు. ఈ జంటతో పాటు నీతా అంబానీ కూడా డ్యాన్స్ చేశారు. చాలా హుషారుగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల ఈ జంట ముంబైలో జరిగిన అర్జున్ టెండూల్కర్-సానియా వివాహానికి కూడా హాజరయ్యారు. ఈ జంటకు 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె ఉంది. అయితే ఆ మధ్య ఈ జంట విడిపోతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగింది. కానీ ఆ వదంతులు తోసిపుచ్చుతూ జంట చక్కటి డ్యాన్స్‌తో కలిసే ఉన్నట్లుగా నిరూపించారు.
View this post on Instagram




