దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హఠాత్తుగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు లోపలికి ప్రవేశించి నానా హంగామా సృష్టించారు. చొక్కాలు విప్పి హల్‌చల్ చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామంతో నిర్వాహకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడంపై నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.




