17
September, 2026

A News 365Times Venture

17
Thursday
September, 2026

A News 365Times Venture

Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..

Date:

దేశం కోసం పని చేయాలనే ఆ మహా సైనిక కల నెత్తుటి కన్నీటి మధ్య అర్ధంతరంగా ఆగిపోయింది. ఖాకీ డ్రస్ వేసుకుని దేశ సరిహద్దుల్లో తిరగాల్సిన ఆకళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. కన్నవారి కడుపుకోతను వర్ణించడం ఎవరి తరమౌతుంది? ఛాతి నిండా దేశభక్తితో, కళ్లలో సైనిక వందనాల స్వప్నాలతో అగ్నివీర్ రన్నింగ్ టెస్ట్‌కు పరుగులు పెట్టిన ఆ బిడ్డ నేలకొరగడం చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది.

విశాఖపట్నంలో జరిగిన అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ యువత ఉత్సాహంతో కళకళలాడవలసిన చోట, అపశృతితో కంటతడి పెట్టించింది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన శేషగిరిరావు (19) దేశ సేవే లక్ష్యంగా ఎంతో కష్టపడి ఈ ర్యాలీకి వచ్చాడు. లక్ష్యం వైపు అడుగులు వేయాల్సిన ఆ లేత కాళ్లు, నిర్దేశిత 1.6 కిలోమీటర్ల పరుగు పందెంలో ఒక్కసారిగా తూలిపోయాయి. ఊపిరి సలపని ఆ అంతులేని ఆయాసంలో, పట్టుదలగా పరిగెత్తిన ఆ యువకుడు అకస్మాత్తుగా సొమ్మసిల్లి కిందపడిపోయాడు. అక్కడికక్కడే కుప్పకూలిన అతడిని చూసి తోటి అభ్యర్థులు కన్నీరు పెట్టారు.

వెంటనే స్పందించిన సిబ్బంది అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ బిడ్డను బతికించుకోవడానికి వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ, విధి మరోలా తలచింది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి బెడ్‌పై కొట్టుమిట్టాడుతూ ఆ యువకుడు చివరకు తుదిశ్వాస విడిచాడు.

దేశాన్ని రక్షించే సైనికుడిగా చూడాలని ఎంతో మురిసిపోయిన పలాసలోని ఆ తల్లిదండ్రులకు ఈ వార్త విని కన్నీరుమున్నీరుగా విలపించారు. కంటికి రెప్పలా పెంచుకున్న బిడ్డ విగతజీవుడిగా మారుతాడని ఆ తల్లిదండ్రులు కలలోనైనా ఊహించి ఉండరు. సైనిక ఉద్యోగం సాధించి ఇంటికి వస్తాడనుకున్న బిడ్డ, ఇలా శవమై తిరిగిరావడంతో ఆ ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం తపించిన ఆ అభాగ్యుడి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..

UPI Charges: UPI చెల్లింపుల ఛార్జీల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రూ....

Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

అడ్వాన్స్ టిప్ విధానాన్ని నిలిపివేయాలని క్యాబ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు...

Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్‌కు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనాలని భారతదేశం రెండు...

Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు

ఇంధన వసతులపై దాడులు చేసుకోవద్దని రష్యా-ఉక్రెయిన్‌లకు అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ఈ...