24
February, 2026

A News 365Times Venture

24
Tuesday
February, 2026

A News 365Times Venture

Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురు మృతి.. వెలుగులోకి సంచలన విషయాలు!

Date:

Adulterated Milk: రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు మృతి చెందగా, మరో 8 మంది కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనకు కారణమైన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసిందని అధికారుల విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈరోజు ఫోరెనిక్స్ నివేదికలు వస్తే అధికారికంగా నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది.

Read Also: Ravi Teja : భర్త మహశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ కు బ్రేక్.. కారణం ఏంటంటే?

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురంకు చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మీ డెయిరీలో, పాలు కల్తీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. డెయిరీలోని రిఫ్రిజిరేటర్ లో కూలెంట్‌గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీకై, ఒక పాల క్యాన్‌లో కలిసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నాలుగు కుటుంబాల్లో 12 మంది, అనూరియా సమస్యతో ఆసుపత్రుల్లో చేరారు.

Read Also: AP Cabinet: నేడే ఏపీ కేబినెట్.. పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక చర్చ!

కాగా, ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉండగా, ఒక చిన్నారి మరో ఇద్దరు వృద్ధుల పరిస్థితి విషమంగా ఉంది. కాగా, పాలల్లో కలిసిన ఇథిలీన్ గ్లైకాల్ సాధారణంగా రిఫ్రిజిరేటర్ లలో కూలెంట్‌గా ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి వెళ్లినప్పుడు తీవ్రమైన విష ప్రభావం చూపి కిడ్నీలను దెబ్బతీస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల కరబ్ అయి, మెదడు దెబ్బతినడం, ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. బాధితుల్లో కనిపించిన లక్షణాలు ఈ రసాయన ప్రభావంతో సరిపోయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

ఇక, పాలు, పెరుగు నమూనాలను సేకరించి సెంట్రల్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ కు, స్టేట్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ లకు ఇప్పటికే అధికారులు పంపించారు. కాగా, వందలాది మంది రక్త నమూనాలు సేకరించగా, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఈరోజు రానున్నాయి. అధికారిక నివేదికలతో కల్తీ పాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిర్ధారణ కానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

El Mencho: మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో ఎలా దొరికాడు.. పట్టించింది ఎవరంటే..!

మెక్సికోలో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో హత్య తర్వాత దేశం అట్టుడికింది....

Nellore Murder: ప్రియుడితో ఎంజాయ్ చేయొద్దన్నందుకు.. యమపురి పంపేసింది! మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..

Nellore Murder: వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. క్షణికావేశంలో నిండు ప్రాణాలను...

Off The Record : ఆదాలతో మాజీ మంత్రి కాకాణి భేటీపై ఆసక్తి…

Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో నెల్లూరు పెద్దారెడ్లంటే ఒక డిఫరెంట్‌...

Bihar Court Serious on AP Police: ఏపీ పోలీసులపై బీహార్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

Bihar Court Serious on AP Police: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై తీవ్ర...