ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన (IAF) అంగీకరించింది. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు రావడంపై జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిగణలోకి తీసుకుంది. పౌర విమానయానానికి, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించింది. పౌర విమానాల రాకపోకలకు అనువుగా రన్‌వే పునర్నిర్మాణం, పౌర టర్మినల్, ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్రాన్ , ఇతర మౌళిక వసతులను అభివృద్ధి చేయాలని తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఏఐఎఫ్ డైరెక్టర్ లేఖ రాసింది.
READ MORE: Sunita Williams: సునీతా విలియమ్స్ తాజా దృశ్యాలు వైరల్.. మస్క్ రియాక్షన్ ఇదే!
మరోవైపు.. వరంగల్ నగర సమీపంలోని మామూనూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విమాన సర్వీసుల పునరుద్ధరణకు అడ్డంకులు తొలగిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదనే నిబంధన రద్దయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (హెచ్‌ఏఐఎల్)ను నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థతో ఒప్పందం అనంతరం ఈ నిర్ణయం జరిగిందని పేర్కొన్నది. రాష్ట్రంలో మరో రెండు విమానాశ్రయలు నిర్మాణం కానుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.