17
February, 2026

A News 365Times Venture

17
Tuesday
February, 2026

A News 365Times Venture

Actress Pratyusha: సినీ నటి ప్రత్యూష కేసు పూర్తి వివరాలు..

Date:

ఈ కేసు 2002లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో మీడియా, సినీ వర్గాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రత్యూష తెలుగు టీవీ సీరియల్స్, కొన్ని సినిమాల్లో నటించారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించారు. హైదరాబాద్‌లో నివసించేవారు. 23 ఫిబ్రవరి 2002న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ప్రత్యూష మృతి చెందిన స్థితిలో కనుగొన్నారు. ఆమెతో పాటు సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇద్దరూ విషం సేవించినట్లు పోలీసులు అనుమానించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా, సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. పోస్ట్‌మార్టం & ఫోరెన్సిక్ వివరాల ప్రకారం.. ప్రత్యూష శరీరంలో విషపదార్థం (పాయిజన్) ఉన్నట్లు నివేదికలు సూచించాయి. బలవంతపు దాడి, గాయాల ఆధారాలు స్పష్టంగా లేవని తెలిపారు. ఫోరెన్సిక్ ఆధారాల ప్రకారం ఇది విషం సేవించడం వల్ల జరిగిన మరణంగా నమోదు చేశారు.

Also Read:Srinivasa Mangapuram : జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’లో స్పెషల్ రోల్ సర్‌ప్రైజ్!

ప్రత్యూష కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపించారు. కొందరు ప్రభావశీలుల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మొదట ఇది అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత ఆత్మహత్య కోణంలో దర్యాప్తు కొనసాగింది. కాల్ డేటా, సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదికలు పరిశీలించారు. కేసు కోర్టులో విచారణకు వెళ్లింది. సమర్పించిన ఆధారాల ప్రకారం హత్యకు తగిన నిర్ధారణ కాలేదని కోర్టు పేర్కొంది. అప్పట్లో పలు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు మీడియాలో ప్రచారం అయ్యాయి. కానీ వాటికి సంబంధించి నిర్ధారణ కాలేదు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చకు దారి తీసింది.

నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ శిక్ష పెంచాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రత్యూష తల్లి సరోజినీ దేవి.. కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. గత ఏడాది నవంబర్లో తీర్పు రిజర్వ్ చేసింది.. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష ఐదువేల జరిమానా విధించారు.

సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షలు రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసిన ప్రత్యూష తల్లి సరోజినీ దేవి. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలిపినందున సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని లేదంటే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సుప్రీంకోర్టులో ప్రత్యూష తరఫున వాదనలు వినిపించారు. ఇద్దరూ కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడు అన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరఫున వాదనలు వినిపించారు.

Also Read:స్మార్ట్ ఫీచర్లు, 5-స్టార్ సేవింగ్స్.. Panasonic 1.5 Ton Split AC పై రూ. 24000 భారీ డిస్కౌంట్!

సుదీర్ఘ విచారణల అనంతరం సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం రిపోర్టు, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగలిపినట్లుగా లభించిన ఆధారాలు, హెల్త్ రిపోర్ట్స్ సహా ఏడు ఆధారాలను పరిశీలించి సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్ సమర్థించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనుగోలు చేయాలని ప్లాన్...

Errabelli Dayakar Rao : తొర్రూరు కాంగ్రెస్ కైవసం.. కన్నీళ్లు పెట్టుకు ఎర్రబెల్లి..

ఉత్కంఠకు తెరదించుతూ తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్...

1000 Crore Club: 1000 కోట్లను అందుకునే కొత్త డైరెక్టర్ ఎవరు..?

1000 Crore Club: టాలీవుడ్‌లో రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్‌ను...

Mahesh Babu: ‘వారణాసి’ ఓకే.. నెక్స్ట్ ఏంటి?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు...