28
April, 2026

A News 365Times Venture

28
Tuesday
April, 2026

A News 365Times Venture

UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..

Date:

UIDAI Important Update: యూఐడీఏఐ (UIDAI) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ కార్డు వినియోగదారులందరూ తప్పక తెలుసుకోవాల్సిన మార్పును సూచిస్తోంది. ఇప్పటివరకు మనలో చాలామంది ఆధార్ కార్డును కేవలం గుర్తింపు కార్డుగానే కాకుండా పుట్టిన తేదీకి (Date of Birth) బలమైన ఆధారంగా భావిస్తూ వస్తున్నాం. అయితే, ఇకపై ఆధార్‌ను పుట్టిన తేదీ ధృవీకరణ కోసం ప్రామాణిక పత్రంగా పరిగణించకూడదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆధార్ కేవలం మీ గుర్తింపును, నివాసాన్ని నిరూపించే పత్రం మాత్రమేనని, వయసును నిర్ధారించే పత్రం కాదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆధార్ అథెంటికేషన్ సర్వీసులను ఉపయోగించే ఏజెన్సీలకు (AUA/KUA) ప్రత్యేక లేఖలను పంపారు.

ఆధార్‌ను పుట్టిన తేదీకి ఆధారంగా ఎందుకు తీసుకోకూడదనే విషయంలో యూఐడీఏఐ సహేతుకమైన కారణాలను వెల్లడించింది. సాధారణంగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు లేదా అప్‌డేట్ చేసేటప్పుడు నివాసితులు ఇచ్చే సమాచారం ఆధారంగానే పుట్టిన తేదీని నమోదు చేస్తారు. ఒకవేళ ఎవరి వద్దనైనా సరైన బర్త్ సర్టిఫికేట్ లేదా స్కూల్ సర్టిఫికేట్ వంటి పత్రాలు లేకపోతే, వారు చెప్పిన వయసును బట్టి సిస్టమ్ ఆటోమేటిక్‌గా పుట్టిన సంవత్సరాన్ని లెక్కగట్టి, డిఫాల్ట్‌గా ఆ ఏడాది జనవరి 1వ తేదీని పుట్టిన తేదీగా మారుస్తుంది. ఇలాంటి “డిక్లేర్డ్” పుట్టిన తేదీలు వాస్తవ తేదీతో విభేదించే అవకాశం ఉండటం వల్ల, దీనిని అధికారిక బర్త్ ప్రూఫ్‌గా పరిగణించలేమని స్పష్టం చేశారు. కేవలం బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా ద్వారా సదరు వ్యక్తి గుర్తింపును ధృవీకరించడమే ఆధార్ ప్రధాన ఉద్దేశమని గుర్తుంచుకోవాలి.

అయితే, ఆధార్ కార్డు ఇతర ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేదని యూఐడీఏఐ తెలిపింది. భౌతిక ఆధార్ కార్డుతో పాటు ఈ-ఆధార్, మాస్క్‌డ్ ఆధార్, ఆఫ్‌లైన్ XML, క్యూఆర్ కోడ్ (QR Code) వంటివన్నీ గుర్తింపు కార్డుగా, అడ్రస్ ప్రూఫ్‌గా యథావిధిగా చెల్లుబాటు అవుతాయి. వివిధ ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు లేదా ఇతర సేవల కోసం ఆధార్‌ను పుట్టిన తేదీకి ప్రామాణికంగా వాడాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే తీసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. అయినప్పటికీ, పాస్‌పోర్ట్ లేదా ఇతర చట్టపరమైన కార్యకలాపాల కోసం పుట్టిన తేదీని నిరూపించాల్సి వస్తే మాత్రం బర్త్ సర్టిఫికేట్ లేదా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో వంటి పత్రాలనే సిద్ధం చేసుకోవడం ఉత్తమం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Fuel Shortage: పెట్రోల్‌ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..

Fuel Shortage: రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితులపై ఆహార, పౌరసరఫరాల శాఖ...

Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..

టాలీవుడ్ లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు...

Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో...

Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోగా దూసుకుపోతున్నారు. వరుస...