24
April, 2026

A News 365Times Venture

24
Friday
April, 2026

A News 365Times Venture

Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట

Date:

Telangana High Court: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి హరీష్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసుల్లో వీరిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. 2011 మార్చిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ట్యాంక్ బండ్ వద్ద జరగగా.. ఆ సమయంలో ఆందోళనకారులు కొన్ని మీడియా సంస్థలకు చెందిన కెమెరాలు, వోబీ వ్యాన్లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Read Also: Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!

అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను కూడా నిందితులుగా చేర్చారు. అయితే, ఈ ఘటనకు పిటిషనర్లకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వారి తరఫు న్యాయవాది రమణారావు కోర్టులో వాదనలు వినిపించారు. ఇక, వాదనలు విన్న హైకోర్టు, కేసులో సరైన ఆధారాలు లేవని భావించి కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుపై నమోదైన కేసులను కొట్టివేసింది. దీంతో బీఆర్ఎస్ నాయకత్వానికి ఇది కీలక ఊరటగా భావిస్తున్నారు. కాగా, తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత కలిగిన ఈ కేసులో హైకోర్టు నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మిలియన్ మార్చ్ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో, ఈ తీర్పుకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఏర్పడింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

Off The Record: కొణిదెల నాగబాబు…. జనసేన ఎమ్మెల్సీ. ఆయనకు మంత్రి...

IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంలో కీలకమైన మార్పులు చేస్తూ ఏడుగురు...

Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..

Crime: ప్రేమించిన యువతితో యువకుడు పారిపోయాడు. కానీ దీనికి మూల్యం మాత్రం...

MLC Anantha Babu Arrest: బిగ్‌ బ్రేకింగ్‌.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..

MLC Anantha Babu Arrest: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత,...