22
April, 2026

A News 365Times Venture

22
Wednesday
April, 2026

A News 365Times Venture

MS Dhoni: ధోనీకి “లెఫ్టినెంట్ కల్నల్” హోదా ఇవ్వడం నాకు ఇష్టం లేకుండే.. రిటైర్డ్ లెఫ్టినెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Date:

MS Dhoni: ఎంఎస్ ధోనీ అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్‌. కానీ.. ధోనీలో రెండో కోణం కూడా ఉంది. ధోనీ అంకితభావం కలిగిన దేశభక్తుడిగానూ గుర్తింపు పొందారు. దేశం కోసం తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. భారత ప్రాదేశిక సైన్యం (Territorial Army) లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కొనసాగుతున్నారు. అయితే, ధోనీకి ఈ అత్యున్నత హోదా ఇవ్వడం వెనుక తొలినాళ్లలో కొంత వ్యతిరేకత ఉండేదన్న ఆసక్తికర విషయాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.

READ MORE: భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

అప్పట్లో ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె. సింగ్, ధోనీకి ఈ గౌరవ హోదా ఇవ్వాలని నిర్ణయించినప్పుడు వినోద్ భాటియా కొంత అసహనం వ్యక్తం చేశారట. దానికి ఒక బలమైన కారణం ఉందని భాటియా వెల్లడించారు. “భారత సైన్యంలో ‘మెరూన్ బెరెట్’ (Maroon Beret) ధరించడం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయం. ఒక సామాన్య పౌరుడికి ఈ గౌరవాన్ని ఇవ్వడం వల్ల పారాట్రూపర్ల విలువ తగ్గుతుందేమోనని నేను భావించాను. సాధారణంగా పారాట్రూపర్ కావాలంటే ఆరు నెలల కఠినమైన శిక్షణ (ప్రొబేషన్) పూర్తి చేయాలి. ఆ శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందంటే, అందులో కేవలం 20 శాతం మంది మాత్రమే విజయం సాధించగలరు. అభ్యర్థి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే స్థాయిలో ఉండే ఆ శిక్షణ లేకుండా మెరూన్ బెరెట్ ఇవ్వడం సరికాదని నేను తొలినాళ్లలో అనుకున్నాను. కానీ, ధోనీ తన ప్రవర్తనతో ఆ అంచనాలను తలకిందులు చేశారు. గౌరవ హోదా లభించిన తర్వాత ధోనీ ఒక సాధారణ సైనికుడిలాగే తన విధులను నిర్వర్తించారు. 2011లో 106 పారా టీఏ బెటాలియన్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా చేరిన ఆయన, 2015లో ఐదు పారాచూట్ జంప్‌లు విజయవంతంగా పూర్తి చేసి ‘పారా వింగ్’ చిహ్నాన్ని సాధించారు. తనకు ఎత్తు అంటే భయమని స్వయంగా ధోనీ ఒప్పుకున్నప్పటికీ, దేశం పట్ల ఉన్న మక్కువతో ఆ భయాన్ని జయించి మరీ పారాచూట్ జంప్స్ చేశాడు.” అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వివరించారు. ధోనీ నిబద్ధతను దగ్గరుండి చూసిన వినోద్ భాటియా, తన పాత అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నారట. ధోనీ జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వరకు ప్రయాణించి, మన సైనిక యూనిట్లతో కలిసి పనిచేశారని వెల్లడించారు. ఒక సైనికుడికి ఉండాల్సిన క్రమశిక్షణ, నడక, గౌరవం ఆయనలో పుష్కలంగా ఉన్నాయని భాటియా కొనియాడారు. కేవలం హోదా కోసమే కాకుండా, మనసున్న సైనికుడిగా ధోనీ వ్యవహరించిన తీరు తనను ఎంతో గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు.

READ MORE: Abhishek Sharma Record: ఎస్‌ఆర్‌హెచ్‌ ‘రారాజు’ డేవిడ్ భాయ్.. దూసుకొస్తున్న అభిషేక్ శర్మ, ఇంకా ఐదు మాత్రమే!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..

మారుతున్న కాలానికి త‌గిన‌ట్లు మారితేనే మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంది.. ఈక్ర‌మంలోనే విద్యా రంగంలోనూ...

Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..

అనంతపురంలో వెలుగులోకి వచ్చిన ఈ హనీ ట్రాప్ ఉదంతం సమాజంలోని నైతిక...

Kharge vs BJP: మోడీ టెర్రరిస్ట్.. ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు...

Iran: అసిమ్ మునీర్.. ట్రంప్ భజనపరుడు.. ఓ రేంజ్‌లో ఆడుకున్న ఇరాన్ మీడియా

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్...