12
April, 2026

A News 365Times Venture

12
Sunday
April, 2026

A News 365Times Venture

Nimmala Ramanaidu : జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదం

Date:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. జగన్ చేస్తున్న రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంలా ఉన్నాయని, రాష్ట్రంలో విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. “చంపుతాం, నరుకుతాం, అంతం చేస్తాం” అనేవి జగన్ రాజకీయ నిఘంటువులో ప్రధాన పదాలుగా మారిపోయాయని ధ్వజమెత్తారు.

జగన్ ఇచ్చే రాజకీయ హామీలు అత్యంత భయంకరంగా ఉన్నాయని మంత్రి విమర్శించారు. అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతామని, పనులు ఆపేస్తామని, యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తామని జగన్ పరోక్షంగా చెబుతున్నారని ఆరోపించారు. కొత్త రకమైన మాదక ద్రవ్యాలను తీసుకువచ్చి యువతకు దాన్నే ఉపాధిగా చూపించడమే జగన్ ‘యూత్ పాలసీ’ అని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ గురించి మాట్లాడకుండా, ‘రప్పా రప్పా’ అంటూ నరుకుతామనడం ఆయన ఉన్మాదానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.

Donald Trump: “హోర్ముజ్‌ మూసేస్తాం”.. ట్రంప్ వార్నింగ్‌తో ప్రపంచం టెన్షన్..

రాజకీయ ఎదుగుదల కోసం జగన్ తన సొంత బాబాయ్ వివేకాను కూడా వదల్లేదని మంత్రి ఆరోపించారు. “రాజకీయంగా అడ్డొస్తే సొంత బాబాయ్ నైనా అంతం చేయడమే జగన్ విధానం” అని వ్యాఖ్యానించారు. గతంలో వివేకాను బలవంతంగా ఎంపీ పదవికి రాజీనామా చేయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, తండ్రి ఆచూకీ లభ్యం కాకముందే సంతకాలు చేయించుకున్న జగన్ నైజాన్ని ఎండగట్టారు. గతంలో పరిటాల రవి హత్య కేసు నుండి జగన్ ను బయటపడేయడానికి తనకు ఆరు నెలలు పట్టిందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్న మాటలను ఆయన గుర్తు చేశారు.

వంగవీటి రంగా హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ జగన్ పై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. రంగాను హత్య చేసిన కుటుంబం ఇప్పుడు ఎవరి అండన ఉందని ప్రశ్నించారు. రంగాను ‘రౌడీ’ అని అవమానించిన గౌతమ్ రెడ్డికి ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన జగన్, ఇప్పుడు రంగా కుటుంబం ఏ పక్షాన ఉందో గమనించాలని సూచించారు. రంగా హత్యలో ప్రధాన నిందితుడి కుటుంబానికి హైదరాబాద్‌లో రూ. 1000 కోట్ల విలువైన స్థలాలను గిఫ్ట్‌గా ఎందుకు ఇచ్చారని జగన్‌ను నిలదీశారు.

షుగర్, బిపి కంట్రోల్ అవ్వాలా? మీ డైట్‌లో ఈ గింజలను చేర్చుకోండి!

జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తొలుత ఆర్థిక ఉగ్రవాదిగా మారి వ్యవస్థలను కలుషితం చేశారని, ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టి పాలనను, అధికారులను కూడా భ్రష్టు పట్టించారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఇప్పుడు “గొడ్డలి పార్టీ”గా మారిందని, వినాశనం , విధ్వంసమే దాని ఎజెండా అని విమర్శించారు. ఇలాంటి ఉన్మాద రాజకీయాలకు రాష్ట్రంలో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) శాఖలో జరిగిన ఒక...

US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా...

Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

Moringa Powder: డైటింగ్ చేస్తున్నారా, మీ ఒంట్లో పేరుకుపోయిన మొండి కొవ్వును...

RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

RCB vs MI: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న...