12
April, 2026

A News 365Times Venture

12
Sunday
April, 2026

A News 365Times Venture

Asha Bhosle: 10 ఏళ్ల కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

Date:

Asha Bhosle:భారత సంగీతం ఒక దిగ్గజ గాయనిని కోల్పోయింది. బాలీవుడ్ స్టార్ సింగర్ ఆశాభోస్లే ఆదివారం కన్నుమూశారు. 92 ఏళ్ల ఆశా శనివారం సాయంత్రం గుండెపోటుతో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేరారు. ఆమె మరణంతో భారత సంగీత ప్రపంచం ఒక శకాన్ని కోల్పోయింది. 12,000కు పైగా పాటు, 20 భాషల్లో గానం చేయడం వంటి రికార్డులు ఆమె పేరిట ఉన్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె స్థానం సంపాదించారు. మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్ వంటి దిగ్గజాలతో ఆశాభోస్లే కలిసి పనిచేశారు. ఆర్‌డీ బర్మన్, ఎస్‌డీ బర్మన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఆమె పాటలు పాడారు. అనేక హిట్స్ అందించారు.

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ సోదరిగా కెరీర్ ప్రారంభించి ఆశాభోస్లే కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. కేవలం 10 ఏళ్ల వయసులో 1943లో ఆమె కెరీర్ ప్రారంభించారు. తన అక్కలాగే పాటలు పాడటం స్టార్ట్ చేశారు. తన కుటుంబాన్ని పోషించడం కోసం అక్క లతా మంగేష్కర్ తో కలిసి పాటలు పాడారు. మైక్రోఫోన్ అంటే ఏమిటో తెలియని సమయంలోనే 1943లో ఒక మరాఠీ సినిమాలో పాట పాడారు. 1948లో ‘‘చునారియా’’ సినిమాతో ఆశాభోస్లే బాలీవుడ్ అరంగ్రేటం చేశారు.

Read Also: Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

కేవలం 16 ఏళ్ల వయసులోనే లతా మంగేష్కర్ సెక్రటరీ అయిన గణప్రతాప్ భోస్లేను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ నిర్ణయాన్ని ఆమె కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆశాభోస్లేకు 1957లో తొలి విజయం దక్కింది. ఆమె మహ్మద్ రఫీతో పాడిన ‘‘ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ’’ సాంగ్ భారీ విజయం సాధించింది. దీని తర్వాత ఆమె కెరీర్ పీక్స్‌కు వెళ్లింది. మరోవైపు, వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదు. పెళ్లి తర్వాత కొన్ని ఏళ్లకే భర్తతో విభేదాలు ప్రారంభమయ్యాయి. తన పిల్లలతో కలిసి భర్తకు దూరంగా జీవించడం ప్రారంభించింది. 1950 నుంచి 1980 వరకు ఆశాభోస్లే సంగీత ప్రపంచాన్ని ఏలారు.

ఆశాభోస్లే సంగీత దర్శకుడు ఆర్‌డీ బర్మన్‌‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఏడాదికే మళ్లీ విడిపోయారు. అయితే, వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. తన అక్క లతా మంగేష్కర్‌తో ఆశాభోస్లే ఆత్మీయ సంబంధాన్ని కొనసాగించారు. 16 ఏళ్ల వయసులో పెళ్లి నిర్ణయం తర్వాత ఇద్దరి మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది. అయితే, ఆశాకు హేమంత్ భోస్లే జన్మించిన తర్వాత, కుటుంబం మళ్లీ కలిసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) శాఖలో జరిగిన ఒక...

US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా...

Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

Moringa Powder: డైటింగ్ చేస్తున్నారా, మీ ఒంట్లో పేరుకుపోయిన మొండి కొవ్వును...

RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

RCB vs MI: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న...