25
March, 2026

A News 365Times Venture

25
Wednesday
March, 2026

A News 365Times Venture

Vijayawada: టెర్రర్ లింకుల కేసులో ఇద్దరు అరెస్ట్.. వెలుగులోకి కొత్త నిజాలు.!

Date:

Vijayawada: విజయవాడలో టెర్రర్ లింకుల కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో A11 అబ్దుల్ సలాం, A5 సైదా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.

Actor Rajasekhar: డాన్స్ రాదని ఒప్పుకున్న రాజశేఖర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు విచారణను మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనికోసం సంబంధిత బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. అలాగే నిందితులు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్లలో ఉన్న కాల్ డేటా, మెసేజింగ్ వివరాలను విశ్లేషిస్తూ, మరిన్ని లింకులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నిందితులు పట్టుబడిన ఇంట్లో ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే పుస్తకాలు, లిటరేచర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న సైదా బేగం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ సైదాబాద్‌ కు చెందిన ఆమె, ఏడాది క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో సైదా బేగం 42 మందితో ఒక టెర్రర్ గ్రూప్ ఏర్పాటు చేసి, సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టింగ్లు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ కార్యకలాపాలు ఎక్కువగా సాగినట్లు గుర్తించారు. సైదా బేగం విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ, వారి సూచనల మేరకు టెర్రర్ కంటెంట్ ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

YS Jagan: జగన్ 2.0లో మహిళలకు, కార్యకర్తలకు పెద్దపీట.. నేతలతో జగన్ భేటీ..!

అంతేకాదు, యువతను రాడికలైజ్ చేసి ఉగ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు జరిగినట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రభావం పెరుగుతుండటంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిందితులను మరింతగా విచారించేందుకు పోలీసులు కోర్టులో వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Nepal: శ్రీరామ నవమి రోజున నేపాల్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం..

Nepal: నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన...

Iran Attack On USS Abraham Lincoln: అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. వార్నింగ్ ఇచ్చిన గంటకే ఇలా..

అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందనే వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా...

Sravanthi Chokkarapu: పాత వీడియోలతో కుట్ర.. యాంకర్ స్రవంతి సంచలన వివరణ

యాంకర్ స్రవంతి చొక్కరపు తాజాగా ఒక వివాదంపై ఘాటుగా స్పందించారు. గత...

Medchal: కన్న తల్లిని కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన కుమార్తె.. ఏడాది తర్వాత బయటపడ్డ నిజం!

Medchal District: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి...