Ragi Chapati: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి రాగులు బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది రాగి చపాతీలు చేస్తే విరిగిపోతాయని లేదా గట్టిగా వస్తాయని భావిస్తూ ఉంటారు. కానీ, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే రాగి చపాతీలను కూడా గోధుమ చపాతీల కంటే మెత్తగా, పొంగేలా తయారు చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Trump: అగ్రరాజ్యాధినేత యుద్ధ విమరణకు కారణం ఇదేనా?
కావలసిన పదార్థాలు:
రాగి పిండి – 1 కప్పు
నీళ్లు – 1.5 కప్పు (పిండి నాణ్యతను బట్టి)
ఉప్పు – రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి – కొద్దిగా
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ నూనె వేసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా రోలింగ్ బాయిల్ (మరుగుతున్నప్పుడు) అవుతున్నప్పుడు మంటను తగ్గించాలి. మరుగుతున్న నీటిలో రాగి పిండిని వేసి గరిటెతో ఉండలు కట్టకుండా త్వరగా కలపాలి. పిండి నీటిని పూర్తిగా పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆపి, మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆవిరికి పిండి మెత్తబడి చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయి. పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకుని, చేతికి కొద్దిగా నీరు లేదా నూనె రాసుకుని 5 నిమిషాల పాటు బాగా ఒత్తాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే చపాతీలు అంత బాగా వస్తాయి.
పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పొడి రాగి పిండిని అద్దుకుంటూ చపాతీల్లా మెల్లగా ఒత్తాలి. వేడి నీటిలో కలపడం వల్ల పిండికి జిగురు వచ్చి చపాతీలు విరగకుండా వస్తాయి. పెనం బాగా వేడెక్కిన తర్వాత చపాతీని వేసి రెండు వైపులా మీడియం మంటపై కాల్చాలి. అప్పుడు చపాతీలు చక్కగా పొంగుతాయి. కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి లేదా నూనె రాస్తే మరింత రుచిగా ఉంటాయి.
ప్రయోజనాలు ఇవే..
* రాగుల్లో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
* ఇది శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
* పప్పు, కుర్మా లేదా ఏదైనా వెజిటేబుల్ కర్రీతో ఈ చపాతీలు అద్భుతంగా ఉంటాయి.
ఎన్ని గంటలైనా మెత్తగా ఉండే ఈ రాగి చపాతీలను మీరు కూడా ఇంట్లో టైం ఉన్నప్పుడు ప్రయత్నించి చూడండి.
READ ALSO: Koratala Siva: అయ్యో ‘దేవర’.. టాప్ డైరెక్టర్‌కు దొరకని హీరోలు.. నిజమేనా?




