22
March, 2026

A News 365Times Venture

22
Sunday
March, 2026

A News 365Times Venture

Dhurandhar : The Revenge : తెలుగు రాష్ట్రాల్లో ధురందర్ దండయాత్ర.. టికెట్టు ముక్క లేదు

Date:

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది… అదే ధురంధర్ 2′ (Dhurandhar: The Revenge). బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కేవలం వసూళ్ల వర్షం మాత్రమే కాదు ఒక సునామీని సృష్టిస్తోంది. తెలుగు వెర్షన్ రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ అయినా కూడా ఈ సినిమా చూపిస్తున్న ‘రాంపేజ్’ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి. గతంలో ‘యురి’, ‘ధురంధర్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆదిత్య ధర్, ఇప్పుడు ‘ధురంధర్ 2’తో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Also Read : Aditya Dhar : హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఆదిత్యధర్.. ఈ ఇద్దరితో నెక్ట్స్ మల్టీస్టారర్

విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును దాటి చరిత్ర సృష్టించింది. హిందీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది కేవలం సినిమా కాదు ఒక ‘ఎమోషన్’ అనిపిస్తోంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ వ్యాప్తంగా తెలుగు వెర్షన్ ఊహించని రీతిలోఅదరగొడుతుంది. మారుమూల ఉండే డబ్బా థియేటర్లలో కూడా ఈ రోజు అన్ని షోలు ఫుల్స్ పడటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు నాట ఈ సినిమా సృష్టిస్తున్నది ‘అరాచకం’. సీ సెంటర్స్, డి సెంటర్స్ అనే తేడా లేకుండా ప్రతి చోటా జనం థియేటర్లకు పోటెత్తుతున్నారు. చాలా ఏరియాల్లో ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలను తెచ్చిపెడుతోంది. రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ టేకింగ్, మరియు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Box Office : ధురంధర్ – 2 దాటికి విలవిలలాడిన ఉస్తాద్ భగత్ సింగ్

గత గురువారం (మార్చి 19) ఉగాది కానుకగా విడుదలైన ‘ధురంధర్ 2’...

Cyber Crime Cases: స్మార్ట్ ఫోన్‌తో జాగ్రత సుమా..! అమ్మాయిలకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచనలు..

Cyber Crime Cases: స్మార్ట్ ఫోన్‌తో జాగ్రత సుమా..!! అంటున్నారు హైదరాబాద్...

Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

Suryapet Job Scam: ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీగా నగదు వసూళ్లు...