21
March, 2026

A News 365Times Venture

21
Saturday
March, 2026

A News 365Times Venture

PM Modi: “మా నాన్న మోడీ చెబితేనే వింటారు”.. ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్‌పై స్పందించిన ప్రధాని.. ప్రజలకు కీలక విజ్ఞప్తి!

Date:

PM Modi: దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక సందేశం ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యువరాజ్ దువా రూపొందించిన ఒక రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలు చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. వాస్తవానికి.. సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ అయిన యువరాజ్ దువా సరదాగా ఒక రీల్ చేశాడు. తన తండ్రికి మోడీ అంటే ఎంతో ఇష్టమని, ప్రధాని మోడీ చెబితే ఏం అయినా చేస్తారని చెప్పాడు. మోడీకి ఒక రిక్వెస్ట్ చేశాడు. యవరాజ్ తండ్రికి షుగర్ ఉందట. అయినా స్వీట్లు తినడం ఆపడం లేదట. తన కుటుంబీకులు ఎవ్వరు చెప్పినా వినడం లేదట. ప్రధాని మోడీ మాటలను మాత్రమే నా తండ్రి వింటారని యువరాజ్ అన్నాడు. అందుకే ప్రధాని మోడీకి ఒక అభ్యర్థన చేశాడు. దయ చేసి నెక్ట్స్‌ మన్ కీ బాత్ కార్యక్రమంలో షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడండి. మీరు చెబితే మా నాన్న తప్పకుండా వింటారని యువరాజ్ పేర్కొన్నాడు.

READ MORE: Trump: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఇదేనా? ఇరాన్ ఏం చేయబోతుంది?

ఇక ఈ వీడియోపై ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోడీ స్పందించారు. యువరాజ్ దువాకి సంబంధించి వీడియోను స్టోరీలో షేర్ చేశారు. యువరాజ్ తండ్రితో పాటు దేశప్రజలందరూ చక్కెర వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అధిక చక్కెర వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరిస్తూనే, ప్రతిరోజూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని మోడీ సూచించారు. “మీ శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. బాగా తినండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అధిక చక్కెర అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. ఊబకాయం ముప్పు కూడా పెరుగుతుంది. అలాగే, యోగాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి ఇది ఒక గొప్ప మార్గం.” అని ప్రధాని పేర్కొన్నారు. ఇక ప్రధాని సందేశం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ప్రధాని తన వీడియోను షేర్ చేయడం పట్ల యువరాజ్ దువా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన వీడియో ప్రధాని మోడీ వరకు చేరుతుందని అనుకోలేదన్నాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kolkata Knight Riders: ఐపీఎల్ ముందే కేకేఆర్‌కు వరుస దెబ్బలు.. మరో స్టార్ బౌలర్ దూరం..

Kolkata Knight Riders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026కు ముందు,...

Madhumita: ప్రముఖ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత

ప్రముఖ ఒడిస్సీ కళాకారిణి మధుమిత రౌత్ (59) కన్నుమూశారు. శనివారం ఉదయం...

South Korea: డేజియోన్ కారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 59కి తీవ్రగాయాలు

దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. డేజియోన్ నగరంలోని కారు విడిభాగాల...

Chicken Price Hike: రంజాన్ వేళ.. చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు ఆదివారం అంటేనే పండుగ. కానీ.. ప్రస్తుత...