1
March, 2026

A News 365Times Venture

1
Sunday
March, 2026

A News 365Times Venture

Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

Date:

Abhishek Sharma: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. భారత్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని అని 140 కోట్ల మంది కోరుకుంటున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్ అభిషేక్ శర్మ నిరాశ కనబరిచాడు. 196 లక్ష్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగిన టీమిండియాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ సారి కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అభిషేక్ శర్మ మిడిల్, లెగ్ వైపు వచ్చిన షార్ట్ బంతిని పుల్ చేయబోయి టైమింగ్ కోల్పోయాడు. బంతి నేరుగా దీప్ స్క్వేర్ లెగ్‌లో షిమ్రోన్ హెట్‌మైర్ వైపునకు వెళ్లింది. హెట్‌మైర్ ఈజీగా క్యాచ్ పట్టాడు. దీంతో అభి 11 బంతుల్లో 10 పరుగులతో వెనుదిరిగాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ 29కి 1 వికెట్ కోల్పోయింది. ఒక్కసారిగా మైదానంలో నిశ్శబ్దం నెలకొంది. ఇటు ఫీల్డింగ్‌లోనూ అభి ఫెయిల్ అయ్యాడు. రెండు క్యాచ్‌లు వదిలేశాడు.. ముఖ్యంగా రోస్టన్ చేజ్ క్యాచ్‌ మిస్ చేయడం భారీ తప్పదంగా మారింది.

READ MORE: India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

జింబాబ్వేతో జరిగిన డూ-ఆర్-డై మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు. టోర్నీ ఆరంభం నుంచి వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న అభిషేక్, ఈ కీలక మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని తన సత్తా చాటాడు. తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన అభిషేక్, మొదటి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయి, దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే, జింబాబ్వేపై ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో అతను తిరిగి ఫామ్‌లోకి రావడం భారత అభిమానులకు ఊరటనిచ్చింది. కానీ.. వెస్టిండీస్‌ మ్యాచ్‌లో మాత్రం మళ్లీ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈ ఓపెనర్ ఫామ్‌పై సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. అతడిని జట్టులో నుంచి తప్పించాలని అభిమానులు పెద్ద ఎత్తున పోస్ట్‌లు చేశారు. మరికొందరు అభిషేక్ ఆత్మవిశ్వాసం తగ్గిందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు “సహజ ఆటశైలిని కొనసాగించాలి కానీ ప్రత్యామ్నాయ ప్రణాళిక సైతం అవసరం” అని చెబుతున్నారు. “అభిషేక్ శర్మ తప్పించండి.. టీమ్‌కు భారంగా మారుతున్నాడు.. ప్రదర్శన అస్సలు బాగాలేదు. అభీకీ బదులుగా రింకూ సింగ్‌తో ఓపెన్ చేయండి.” అంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో కేవలం పది పరుగులు సాధించి, రెండు క్యాచ్‌లు మిస్ చేయడం దారుణం.. బౌలర్లకు అభీ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్స్ వస్తున్నాయి. కొందరు మాత్రం సపోర్టుగా పోస్టులు పెడుతున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

India Oil Reserves: ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయిల్ దాడులు మధ్యప్రాచ్యాన్ని ఉద్రిక్తతల్లోకి నెట్టాయి....

IND vs WI: ఈడెన్‌లో వెస్టిండీస్ ప్లేయర్ల గర్జన.. భారత్ ముందు భారీ లక్ష్యం!

India vs West Indies Super 8: కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో...