27
February, 2026

A News 365Times Venture

27
Friday
February, 2026

A News 365Times Venture

Off The Record: బట్టబయలైన పాలమూరు కాంగ్రెస్‌ గ్రూప్‌ పాలిటిక్స్‌

Date:

Off The Record: పాలమూరు మేయర్‌ ఎన్నిక ఎపిసోడ్‌లో చిత్ర విచిత్రాలు జరిగాయా? కాంగ్రెస్‌ శిబిరంలోకి పరోక్షంగా చొరబడేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నించిందా? వాళ్ళు డబ్బులు పంపారన్న ఆరోపణల్లో నిజమెంత? ఇన్నాళ్ళు కాంగ్రెస్‌లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు సైతం ఈ దెబ్బకు బట్టబయలయ్యాయా? సీఎం సొంత జిల్లాలోని మెయిల్‌ మున్సిపాలిటీలో పార్టీ పరిస్థితి ఏంటి? లెట్స్‌ వాచ్‌.

సియం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా రూపాంతంరం చెందిన మహబూబ్ నగర్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించింది. మున్సిపల్‌ ఎన్నికనోటిఫికేషన్‌కు ముందే పార్టీ చేపట్టిన వివిధ సర్వేల్లో మొత్తం 60 డివిజన్లకు గాను 40కి పైగా గెలుస్తామని సర్వేల్లో తేలిందట. తీరా ఫలితాలు చూస్తే… 30లోపే వచ్చాయి. ఇండిపెండెంట్స్‌గా గెలిచిన ఐదుగురు సైతం కాంగ్రెస్‌కు జై కొట్టడంతో… మొత్తం ఆ పార్టీ బలం 34కు పెరిగింది. మేయర్ , డిప్యూటి మేయర్ ఎన్నిక సైతం ముగిసింది. మేయర్‌గా గుమాళ మమత, డిప్యూటి మేయర్‌గా సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

CM Revanth Reddy : CURE పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం రేవంత్‌ సూచనలు

అయినాసరే…శుభం కార్డు పడకపోగా… జీడిపాకం సీరియల్‌లా ఇంకా సాగుతూనే ఉంది. ఇన్నాళ్ళు నివురు గప్పిన నిప్పులా ఉన్న మహబూబ్ నగర్ కాంగ్రెస్ లోని గ్రూప్ పాలిటిక్స్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బట్టబయలయ్యాయి. ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఒక వైపు, డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఒబేదుల్లా కొత్వాల్ మరో వైపు స్వపక్షంలో విపక్షం మాదిరిగా కొట్లాడుకుంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బిఫామ్ ల మొదలు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వరకు వేసిన ఎత్తుగడలు, నాటకీయ పరిణామాలు హస్తం పార్టీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్ కు అద్దం పడుతున్నాయంటున్నారు పరిశీలకులు.

ఇక మేయర్‌ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో చాలా మంది కాంగ్రెస్‌ నేతల కుటుంబ సభ్యులు దాని మీద ఆశలు పెట్టుకున్నారు. ఆనంద్ గౌడ్ తన భార్య ప్రసన్నకు మేయర్ పదవి కోసం సర్వ శక్తులు ఒడ్డగా… ఆయనకు డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్, TMFC చైర్మన్ కొత్వాల్ సపోర్ట్‌ చేశారట. ఇదే సమయంలో మొదటి నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి మేయర్ పదవి ఇవ్వడం ద్వారా పార్టీ మనుగడ, ఆ వర్గాల మద్దతు ఉంటుందని భావించి అనూహ్యంగా గుమాల మమత పేరును తెరపైకి తెచ్చి పీఠం పై కూర్చోబెట్టారు ఎమ్మెల్యే యెన్నం. ఇదిలా ఉంటే ఫలితాలు వచ్చిన వెంటనే క్యాంప్‌నకు తరలి వెళ్లారు కార్పొరేటర్ లు. మొదట చీరాలకు వెళ్లిన బృందాన్ని తరువాత శంషాబాద్ కు తరలించారు.

ఇన్ఛార్జ్‌గా వ్యవహరించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్నం క్యాంప్‌లో అభిప్రాయ సేకరణ జరపగా అంతా మీ ఇష్టం అని చెప్పారట ఎక్కువ మంది. అందుకే సామాజిక సమీకరణలతో పాటు, వివిధ ఇక్వేషన్స్ చూసి మమత పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. కానీ… తన భార్యకు మేయర్ పదవి దక్కించుకునేందుకు ఆనంద్ గౌడ్ క్యాంప్‌లో నాటకీయ పరిణామలకు తెరతీయడం, కొనుగోలు ఎపిసోడ్ కు తెరలేపి డబ్బు పంపిణీ చేయడం క్యాంప్‌లో కలకలం రేపింది.

OTR: పర్యటన వివరాలు సీక్రెట్‌గా ఉంచడంలో ఆంతర్యం ఏంటి?

ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎమ్మెల్యేలు పోలీస్లకు సమాచారం ఇవ్వడం… ఆనంద్ గౌడ్‌ను అదుపులోకి తీసుకొని విడిచిపెట్టడం వంటి నాటకీయ పరిణామాలు చర్చనీయంశంగా మారాయి. అయితే సుమారు నాలుగు కోట్ల డబ్బు, క్యాంప్ కు తేవడం, డబ్బు సమకూర్చడం వెనుక విపక్ష బీఆరెస్ పాత్ర ఉందనే అనూమానాలు వ్యక్తం చేస్తోంది ఎమ్మెల్యే అండ్ టీమ్. ఇక ఇదే సమయం లో డీసీసీ సంజీవ్, ఓబేదుళ్ల కొత్వాల్ లు సైతం ప్రజాస్వామ్య యుతంగా కాకుండా… నోట్ల కట్టలతో కుట్ర లకు తెరలేపి, సియం సొంత ఇలాఖాలో లో మేయర్ ,డిప్యూటి మేయర్ ఎన్నికను డిస్టబ్ చేయాలని చూశారని, ఎమ్మెల్యే యెన్నం అండ్ టీం ఆరోపిస్తోంది.

దాంతో పాటు డిసిసి సీల్డ్ కవర్ లో సబ్ స్టిట్యూట్ పేర్లు రాయడం కూడా పార్టి లైన్ దాటడమే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మేయర్ పీఠం ఆశావహులుగా ఉన్న నేహశ్రీ , స్వప్నయాదవ్ లను ఓడించేందుకు మరో ఆశావహుడైన ప్రసన్నఆనంద్ గౌడ్ డబ్బు , మద్యం పంపించారని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నిటిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు జిల్లా నాయకులు. మొత్తం మీద పాలమూరు కార్పొరేషన్ ఎన్నిక నాటకీయ పరిణామాలకు , గ్రూపుల ఎత్తుగడలకు వేదకైందని, కాంగ్రెస్‌ పార్టీలోని విభేదాలు వీధికెక్కాయన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy : CURE పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం రేవంత్‌ సూచనలు

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో పాలనను మరింత పారదర్శకంగా,...

OTR: పర్యటన వివరాలు సీక్రెట్‌గా ఉంచడంలో ఆంతర్యం ఏంటి?

OTR: ఓ మంత్రి, ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు కలిసి హెలికాప్టర్‌లో వెళ్ళి...

Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్‌ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!

Ragi Barfi Recipe : రాగి అనేది మన సంప్రదాయ ఆహారాలలో...