27
February, 2026

A News 365Times Venture

27
Friday
February, 2026

A News 365Times Venture

Student Sui*cide: ఓవైపు పేరెంట్స్.. మరోవైపు ప్రేమ.. ఎటు తేల్చుకోలేక!

Date:

Student Sui*cide: విశాఖ జిల్లా పెదగంట్యాడలో ఓ విద్యార్ధిని ఆత్మహత్య కలకలం రేపింది. కని పెంచిన తల్లిదండ్రులు ఎక్కువా? ప్రేమించిన వాడు ఎక్కువా? ఎవరు కావాలో తేల్చుకోలేక సతమతమై ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది విద్యార్ధిని. స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి.

Fake Tea Powder: మనం తాగేది చాయ్ కాదు.. భాగ్యనగరంలో కల్తీ టీ పొడి ముఠా గుట్టురట్టు!
అమ్మానాన్న… నేను ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోతున్నాను. అలాగే మిమ్మల్ని మోసం చేయడం కూడా కరెక్టు కాదనిపిస్తోంది. ఆ అబ్బాయిని వదిలేశాక నాకు ఏదోలా ఉంది. బతకడం ఇష్టంలేక ఈపని చేస్తున్నా.. నేను తప్పు చేశా. లవ్ చేశా. నేను మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఆ అబ్బాయిని వదిలేశా. కానీ.. అతనితోనే నాకు ఉండాలని ఉంది. కానీ నాకు వద్దు. ఎందుకంటే మీరే ఇంపార్టెంట్ నాకు. నేను మీ కోసం ఏమీ చేయలేకపోయా. కానీ తప్పు అయితే చేయాలని అనుకోవట్లేదు. నేనే లేకపోతే తప్పు అవ్వదు కదా. అందుకే బై. చెల్లి, తమ్ముడు జాగ్రత్త అంటూ ఫిజియోథెరపీ చదువుతున్న విద్యార్థిని సూసైడ్‌ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి సత్యం కుటుంబం విశాఖ వుడా కాలనీలోని వినాయకనగర్‌లో నివసిస్తోంది. హెచ్‌సీఎల్‌లో సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె పైడి రజిని మధురవాడలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఫిబ్రవరి 23 నుంచి ఎగ్జామ్స్ ఉండడంతో ప్రిపరేషన్ హాలీడేస్ ఇచ్చారు. దీంతో రజిని ఇంటి వద్దనే ఉంటోంది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా.. రజిని ఇంట్లోనే ఒంటరిగా ఉంది. తండ్రి బయటి నుంచి కుమార్తెకు ఫోన్ చేయటానికి ప్రయత్నించగా స్పందించలేదు. ఎదురింటి వ్యక్తికి చెప్పగా.. వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంది.

ZIM vs IND: టీమిండియా నయా రికార్డ్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?

కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. విగత జీవిగా మారిన కుమార్తెను చూసి షాక్‌కు గురయ్యారు. బెడ్ రూంలోని బెడ్ మీద ఓ పేపర్ పై సూసైడ్ నోట్ రాసి ఉంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు ప్రేమికుడిని మరిచిపోలేక, అటు తల్లిదండ్రులను ఒప్పించలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్ కు తరలించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Fake Tea Powder: మనం తాగేది చాయ్ కాదు.. భాగ్యనగరంలో కల్తీ టీ పొడి ముఠా గుట్టురట్టు!

Fake Tea Powder: చాయ్.. ఓ రిలాక్సేషన్… వర్క్ మోడ్‌లో నుంచి...

Komali Death Mystery: ఒక ఆత్మహత్య ఎన్నో ప్రశ్నలు.. చావుకు కారణం అదేనా?

Komali Death Mystery: యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు కారణాలేంటి? ఇదే ఇప్పుడు...

Telangana Education Commission : ఉపాధ్యాయుల‌కు ఆటోమేటిక్ ప‌దోన్న‌తులు ఉండ‌కూడ‌దు

ఉపాధ్యాయుల‌కు ఆటోమేటిక్ ప‌దోన్న‌తులు ఉండ‌కూడ‌ద‌ని తెలంగాణ విద్యా క‌మిష‌న్ అభిప్రాయ‌ప‌డింది.. వారి...

IND vs ZIM: బెన్నెట్ పోరాటం వృథా.. జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం!

IND vs ZIM: వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భాగంగా...